పండ్లు, కాయగూరలు ఎలా కడగాలో తెలుసా?
అసలే అటు ఇంటి పనులు, ఇటు ఆఫీస్ పనులతో క్షణం తీరిక దొరకదు మన మహిళా లోకానికి. అలాంటిది కరోనా మహమ్మారి మన జీవితంలో అడుగుపెట్టిన దగ్గర్నుంచి ఇంటి శుభ్రత విషయంలో మనం మరింత బిజీగా మారిపోయాం. బయటి నుంచి ఇంటికి తెచ్చిన ప్రతిదీ శుభ్రం చేస్తే గానీ ఇంట్లోకి తీసుకురావట్లేదు. ఈ క్రమంలో ఫుడ్ ప్యాకెట్స్ లేదా ఇతర ప్యాక్ చేసిన వస్తువులైతే శానిటైజర్‌తో శుభ్రం చేసినా పర్లేదు. మరి, కాయగూరలు, పండ్లను కూడా ఇలాగే శుభ్రం చేస్తానంటే కుదరదంటున్నారు నిపుణులు. శానిటైజర్లో ఉండే ఆల్కహాల్ వల్ల కాయగూరలు, పండ్లలోని పోషకాలు నశించే ప్రమాదం ఉండడమే అందుకు ప్రధాన కారణం. అందుకే బయటి నుంచి ఇంటికి తెచ్చిన పండ్లు, కాయగూరల్ని ఎలా శుభ్రం చేయాలో సూచిస్తూ ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ)’ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అవేంటో మనమూ తెలుసుకొని ఫాలో అయిపోదామా?
Know More