సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అందుకే ఈ అమ్మాయిని హార్వర్డ్‌ మెచ్చింది.. స్కాలర్‌షిప్‌ ఇచ్చింది..!

వ్యవసాయంపై ఆధారపడి కూలీనాలీ చేసుకుంటూ బతికే బీద కుటుంబంలో పుట్టిందామె. ఆమె తల్లిదండ్రులిద్దరూ నిరక్షరాస్యులే! అక్షరం ముక్క రాదు.. చదువు విలువ తెలియదు.. పుట్టింది ఆడపిల్ల కదా.. త్వరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపితే భారం దిగిపోతుందనుకున్నారు. కానీ వారి నిర్ణయానికి ఆమె ససేమిరా అంది. ఆడపిల్లనైతే ఏంటి చదువుకునే హక్కు నాకుంది అని వారిని ఎదిరించింది. కేవలం చదువులోనే కాదు.. ఫుట్‌బాల్‌ కోచ్‌గానూ రాణించింది. ఇలా ఆమె చూపిన తెగువ తాజాగా ఆమెను ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి స్కాలర్‌షిప్‌ అందుకునేలా చేసింది. పెరిగి పెద్దయ్యే క్రమంలో తాను ఎలాంటి వివక్షనైతే ఎదుర్కొన్నానో దాన్ని అంతం చేయడమే తన అంతిమ లక్ష్యమంటోన్న ఈ యూత్‌ ఐకాన్‌పై ప్రియాంక చోప్రా, నవ్యా నవేలీ నందా.. వంటి ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

మగాళ్లూ.. అలాంటి మహిళలను చులకనగా చూడకండి!

అందాల తారలను అభిమానించే వారే కాదు... వారిపై విమర్శనాస్త్రాలు సంధించే వారూ చాలామందే ఉంటారు. నేరుగానే కాకుండా సోషల్‌ మీడియాలో కొంతమంది ఆకతాయిలు సెలబ్రిటీలను దూషిస్తూ ఇష్టమొచ్చిన విధంగా పోస్ట్‌లు, కామెంట్లు పెడుతుంటారు. రాజ్యాంగం కల్పించిన ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ను అడ్డు పెట్టుకుంటూ వారి మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తుంటారు. కొంతమంది సెలబ్రిటీలు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటే... కొంతమంది మాత్రం తమపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన వారికి తగిన బుద్ధి చెప్తున్నారు. తాజాగా బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్య నవేలీ నందాకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ సందర్భంగా తన తల్లి శ్వేతాబచ్చన్‌ గురించి చులకనగా మాట్లాడిన ఓ నెటిజన్‌కు తనదైన శైలిలో చురకలంటించింది.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala