‘నో మేకప్’ నుంచి ‘విత్ మేకప్’.. ఎలాగో చూశారా..?
కరోనా కారణంగా ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే ఈ వైరస్ మనుషులను భౌతికంగా దూరం చేయగలిగింది కానీ, మానసికంగా ఒకరికొకరు చేరువగానే ఉంటున్నారు. ఈ క్రమంలో దాదాపు గత నెల రోజులుగా స్నేహితులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు దూరంగా ఉంటున్నప్పటికీ.. టెక్నాలజీ సహాయంతో పరోక్షంగా వాళ్లతో సమయాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో వాళ్లతో వీడియో కాల్స్ మాట్లాడడం, వీడియో గేమ్స్ ఆడడం.. ఇలా లాక్డౌన్లో ఉంటూనే రకరకాల పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు, సోషల్ మీడియాలో పలు ఛాలెంజ్‌లలో సైతం పలువురు పాల్గొంటుండడం విశేషం. ఈ నేపథ్యంలో సినీ, టీవీ రంగాలకు చెందిన కొంతమంది తారలు ఇటీవల #Passthebrushchallenge ('పాస్ ది బ్రష్' ఛాలెంజ్) లో పాల్గొన్నారు. మరి ఆ విశేషాలేంటో మీరే చూడండి.
Know More