జీవితకాలపు ప్రేమ పెళ్లిపీటలెక్కింది!
ప్రేమ.. రెండు మనసుల్ని ఒక్కటి చేసే అందమైన బంధం.. పెళ్లి.. ఆ మధురమైన బంధాన్ని అధికారికం చేసే అద్భుతమైన వేడుక. అలా తమ జీవితకాలపు ప్రేమబంధం ఇప్పుడు పెళ్లితో అధికారికమైందంటున్నాడు బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వరుణ్ ధావన్. తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్‌ను తాజాగా పరిణయమాడి కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడీ కండల వీరుడు. ముంబయి అలీబాగ్‌లోని ఓ హోటల్లో అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నహితుల మధ్య ఏడడుగులు నడిచారీ లవ్లీ కపుల్. వేడుక ఆద్యంతం మిక్స్ అండ్ మ్యాచ్‌గా, మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా మెరిసిపోయిన ఈ అందాల జంట పెళ్లి ముచ్చట్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..
Know More