ఎర్ర చీరలో మేడమ్ సార్.. మేడమ్ అంతే!
పెళ్లంటేనే శుభకార్యం. అలాంటి వేడుకలో శుభసూచకంగా వధువులు ఎరుపు రంగును ఎంచుకోవడం తరతరాలుగా వస్తోన్న సంప్రదాయం! అయితే ఇందులోనూ మారుతోన్న ఫ్యాషన్ ట్రెండ్స్‌కి అనుగుణంగా ఎరుపు రంగులో రూపొందించిన సరికొత్త చీరలు, లెహెంగాలు, ఇతర అవుట్‌ఫిట్స్‌ని ఎంచుకొని.. వాటికి మ్యాచింగ్ జ్యుయలరీని జత చేసి అటు సంప్రదాయబద్ధంగా, ఇటు ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతున్నారు ఈ తరం మగువలు. తాజాగా తన ప్రియుడు, వ్యాపారవేత్త వైభవ్ రేఖితో ఏడడుగులు నడిచిన బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా కూడా తన పెళ్లికి రెడ్ కలర్ బ్రైడల్ ట్రెండ్‌నే కొనసాగించింది. ఎరుపు రంగు లవ్లీ శారీలో ముస్తాబై కాబోయే వధువులందరికీ సరికొత్త బ్రైడల్ ఫ్యాషన్ పాఠాలు నేర్పుతోంది దియా. అందుకే ‘సింప్లీ సూపర్బ్, దేశీ బ్రైడ్’ అంటూ అందరూ ఆమె బ్రైడల్ అటైర్‌కు ఫిదా అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎరుపు రంగును మన వెడ్డింగ్ లుక్స్‌లో ఎన్ని విధాలుగా భాగం చేసుకోవచ్చో తెలుసుకుందాం రండి..
Know More