ఇలా చేస్తే మీ పిల్లల టిక్‌టాక్ ఖాతాలు మీచేతిలో..!
ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో నెటిజన్లను ఆకట్టుకొంటోన్న సోషల్ మీడియా వేదిక ‘టిక్‌టాక్’. డ్యాన్స్ మొదలుకొని.. కామెడీ, మ్యాజిక్, ఫొటోగ్రఫీ, విద్య, అనుకరణ, సందేశాత్మక.. మొదలైన కంటెంట్‌తో వీడియోలను రూపొందించి ఇందులో పోస్ట్ చేస్తుంటారు టిక్‌టాకర్లు. ఈ యాప్‌ని కాలక్షేపం కోసం వాడితే ఫర్వాలేదు.. కానీ కొంతమందికి మాత్రం ఇది వ్యసనంగా మారుతోంది. ముఖ్యంగా ఈ యాప్‌ను వాడే వారిలో ఎక్కువశాతం మంది టీనేజర్లే కావడం గమనార్హం. దీంతో తమ పిల్లలు టిక్‌టాక్‌ను పరిమితికి మించి వాడుతున్నారని ఎంతోమంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఈ సమస్యకు ఓ పరిష్కార మార్గం ఆలోచించింది టిక్‌టాక్ సంస్థ.
Know More