సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

బిలియనీర్‌ తండ్రికి వారసురాలు మాత్రమే కాదు... అంతకంటే ఎక్కువే!

పురుషాధిక్యత అధికంగా ఉండే ఐటీ రంగంలో తొలిసారిగా ఓ మహిళ దిగ్గజ ఐటీ కంపెనీ పగ్గాలు అందుకుంది. ఆమే హెచ్‌సీఎల్ ఛైర్‌పర్సన్గా నియమితురాలైన రోష్నీ నాడార్ మల్హోత్రా. హెచ్‌సీఎల్‌ వ్యవస్థాపకుడు శివ్‌నాడార్‌ ముద్దుల కూతురైన ఆమె టెక్నాలజీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి ఆలోచనల్ని అవపోసన పట్టి, సంస్థకు సంబంధించి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన ముద్రతో దూసుకుపోతున్నారు. మొదట ఓ సాధారణ ఉద్యోగిలా సంస్థలో చేరిన ఆమె అనతికాలంలోనే సంస్థను అభివృద్ధి పథంలో నడిపించి ఇప్పుడు ఆ దిగ్గజ సంస్థకు ఛైర్‌పర్సన్గా నియమితులయ్యారు.

Know More

women icon @teamvasundhara

మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటాం..!

వ్యాపారం సాగింది లేదు.. పరిశ్రమ నడిచిందీ లేదు... సకలం బంద్‌... ఇప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో మళ్లీ కొత్త సందడి మొదలవబోతోంది. కార్యకలాపాల రీస్టార్ట్‌ అంటే ఒకరకంగా మళ్లీ మొదటి నుంచీ ప్రారంభించడమే! అందరితోపాటు మహిళా పారిశ్రామికవేత్తలకూ ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. దీన్నుంచి గట్టెక్కేదెలా? వ్యాపారం సజావుగా సాగే మార్గాలేంటో చెబుతున్నారు ఉషారాణి మన్నె... ప్రతిష్ఠాత్మక ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఫ్లో) హైదరాబాద్‌ చాప్టర్‌కి ఆమె ఈమధ్యే నూతన ఛైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమెను వసుంధర పలకరించింది...

Know More

women icon @teamvasundhara

ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతున్నారా? అయితే ఇది మీకోసమే..!

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతోన్న నేపథ్యంలో ప్రజలు మరికొన్ని రోజులు భౌతిక దూరం పాటిస్తూ ఇళ్లకే పరిమితం కాక తప్పేలా లేదు. ఈ క్రమంలో పలు విద్యాసంస్థలు తమ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా పాఠాలు బోధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా విద్యార్థులు చదువులో వెనకబడకూడదని వాళ్లు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. అంతేకాదు, కొంతమంది ఉద్యోగులు సైతం ఆన్‌లైన్‌ ద్వారా తమకు ఆసక్తి ఉన్న కోర్సులను నేర్చుకొంటూ ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకొంటున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యే వారు గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

క్యాబ్‌లో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఈ టిక్‌టాక్‌ ట్రిక్‌ను వాడండి..!

ప్రస్తుత సమాజంలో మనం ఎదుర్కొంటోన్న సమస్యల్లో ‘మహిళలకు సరైన భద్రత లేకపోవడం’ కూడా ఒకటి. స్కూళ్లు, కాలేజీలు, బస్‌స్టాప్‌లు, హాస్టళ్లు, పని ప్రదేశాలు.. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. జన సమూహాలు ఉండే ప్రదేశాల్లోనే ఇలాంటివి జరుగుతున్నాయంటే.. ఇక నిర్మానుష్య ప్రదేశాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇందులో భాగంగా క్యాబ్‌లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలపై జరిగే అఘాయిత్యాల గురించి తరచూ మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం, క్యాబ్‌ సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అడపాదడపా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉండడం గమనార్హం. ఈ క్రమంలో ఈ సమస్యకు ఓ సులభమైన పరిష్కారాన్ని సూచిస్తున్నారు టిక్‌టాకర్లు. అదేంటో మీరే చూడండి.

Know More

women icon @teamvasundhara

ఈ గూగుల్‌ కొత్త ట్రిక్‌తో ‘డిజిటల్‌ హోలీ’ ఆడేయండి..!

ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి సమాచారం కావాలన్నా మనకు ముందుగా గుర్తొచ్చేది ‘గూగుల్‌’. మీ మనసులో ఉన్న ప్రశ్నను మీకు నచ్చిన భాషలో గూగుల్‌కి విన్నవిస్తే చాలు.. దానికి సంబంధించి ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారాన్ని క్షణాల్లో మీ ముందుంచుతుంది. అంతేనా.. మన ఫొటోలు-వీడియోలను భద్రపరచడం, మనకు తెలియని ప్రదేశాలకు మ్యాప్స్‌ ద్వారా మార్గాలను సూచించడం, ఒక సమాచారాన్ని మనకు నచ్చిన భాషలోకి తర్జుమా చేయడం.. మొదలైన సేవలెన్నో అందిస్తోంది గూగుల్‌. అందుకే ఈతరం వాళ్లు ‘గూగుల్‌’ను తమ బెస్ట్‌ ఫ్రెండ్‌గా భావిస్తున్నారు. ఈ సంస్థ కూడా ఎప్పటికప్పుడు తమ వినియోగదారులను ఆకట్టుకునేలా కొత్తగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా పండగలు, ముఖ్యమైన రోజులు, ప్రముఖుల పుట్టినరోజులు.. తదితర ప్రత్యేక సందర్భాల్లో ఆ సందర్భానికి తగినట్లుగా తమ హోమ్‌ పేజీని క్రియేటివ్‌గా డిజైన్‌ చేయడం (డూడుల్‌ని రూపొందించడం) గూగుల్‌ ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ ఏడాది హోలీ పండగను పురస్కరించుకొని గూగుల్‌ ఓ కొత్త ట్రిక్‌ను నెటిజన్లకు పరిచయం చేసింది. అదేంటో మీరే చూడండి.

Know More

women icon @teamvasundhara

తన మేధస్సుతో టీచర్లకే పాఠాలు బోధిస్తోంది..!

సాంకేతిక పరిజ్ఞానం, కొత్త కొత్త టెక్నాలజీలను ఉపయోగించడంలో.. నిన్నటి తరంతో పోలిస్తే ఈతరం వాళ్లు ఎంతో చురుగ్గా ఉంటారు. ఉదాహరణకు నిన్నటి తరం వాళ్లు 30 ఏళ్ల వయసులో తెలుసుకున్న విషయాలను.. ఈ తరం వాళ్లు 10 ఏళ్లకే నేర్చేసుకుంటున్నారు. రెండేళ్ల వయసు దాటని పిల్లలు కూడా ఎవరి సహాయం లేకుండానే స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్‌ చేసి మొబైల్‌ గేమ్స్‌ ఆడడం, యూట్యూబ్‌లో వీడియోలు చూడడం.. లాంటివి చేస్తున్నారు. అనునిత్యం టెక్నాలజీతో అనుసంధానమైన ఇలాంటి వాతావరణంలో వాళ్లు పెరుగుతుండడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అందుకే టెక్నాలజీకి సంబంధించిన విషయాల్లో నిన్నటి తరం కంటే ఈతరం పిల్లలు ఎంతో చురుగ్గా ఉంటున్నారు. స్కూల్‌లో చదువుకునే రోజుల్లోనే సాంకేతిక రంగంలో అద్భుతాలు సృష్టించిన ఎంతోమంది చిన్నారుల గురించి మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం. ఈ క్రమంలో లుధియానాకు చెందిన నమ్యా జోషి అనే ఓ 13 ఏళ్ల అమ్మాయి 'Minecraft' అనే కంప్యూటర్‌ గేమ్‌ ద్వారా స్కూల్‌ పిల్లలకు ఆసక్తికరంగా పాఠాలు ఎలా చెప్పాలో నేర్పిస్తోంది. తను ఈ గేమ్‌పై తోటి విద్యార్థులకే కాదు.. తన స్కూల్‌ టీచర్లకు, ప్రపంచవ్యా్ప్తంగా ఉన్న ఎంతోమంది టీచర్లకు సైతం ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ ఇస్తూ వాళ్లకు గురువుగా మారడం విశేషం. ఈ చిన్నారి మేధస్సు చూసి సాక్షాత్తూ మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యా నాదెళ్ల సైతం ఆశ్చర్యపోయారు. ఇటీవలే దిల్లీలో జరిగిన ‘Young Innovators Summit’ వేదికపై ఆయన నమ్యను ప్రత్యేకంగా గౌరవించడం విశేషం.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala