మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మరవకండి..!
సినీతారలకు ఎంత ఎక్కువమంది అభిమానులుంటే, అంత బలం. అభిమానులు వారిపై చూపించే ప్రేమకు కొంతమంది సినీ తారలు ఫిదా అవుతుంటారు. అయితే, ఇటీవల ఒక అభిమాని, మన టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్దేను కలవడానికి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 రోజుల పాటు, ముంబయి రోడ్లపై ఎదురుచూశాడు. తన నిరీక్షణ ఫలించి పూజను కలిశాకే అక్కడి నుంచి కదిలాడు. ఈ విషయాన్ని పూజ స్వయంగా తన ఇన్స్టా ద్వారా తెలిపింది. తనకోసం వచ్చిన అభిమానితో మాట్లాడుతున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘నా కోసం ముంబయి వచ్చి 5 రోజుల పాటు ఎదురుచూసినందుకు నీకు ధన్యవాదాలు భాస్కర్ రావు (అభిమాని పేరు). ఇది నా హృదయాన్ని తాకింది. కానీ.. నా అభిమానులు నాకోసం ఇలా కష్టపడటం చాలా బాధగా ఉంది. నాకోసం వచ్చిన అభిమానులు ఇలా రోడ్లపై పడుకోవడం నేనెప్పుడూ కోరుకోను. నువ్వు ఎక్కడున్నా, నీ ప్రేమను నేను ఫీలవుతానని మాటిస్తున్నాను. అభిమానులే నా బలం. లవ్ యూ..’ అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చింది పూజ.
Know More