‘ఎలా ఉన్నా అందమే...’ అని చాటుతున్న బార్బీ డాల్స్!
‘బార్బీ బొమ్మ’ ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే.. సన్నజాజి నడుము, అందమైన చిరునవ్వు, ఆకర్షణీయమైన కళ్లు, మెరిసే జుట్టుతో ఉన్న ఫ్యాషనబుల్ అమ్మాయిలా అని సమాధానమిస్తాం. అయితే ఇది ఒకప్పటి మాట..! ఇప్పుడు బార్బీ డాల్ అంటే కేవలం అందం మాత్రమే కాదు.. ధైర్యం, జ్ఞానం, పోరాట స్ఫూర్తి, సేవా దృక్పథం.. మొదలైన లక్షణాలున్న వనితలంతా బార్బీ బొమ్మలే. అంతేకాదు మనం తెలుపా నలుపా, లావా సన్నమా అన్నది పట్టించుకోకుండా; తమలోని లోపాల గురించి ఆందోళన చెందకుండా.. లక్ష్యసాధనకై ధైర్యంగా ముందుకు సాగుతూ నలుగురికీ ఆదర్శంగా నిలిచే ప్రతి యువతీ అపురూప సౌందర్యవతే.. అని బార్బీ సంస్థ తమ బొమ్మల ద్వారా ప్రపంచానికి చాటే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో కొత్త దశాబ్దం ప్రారంభమైన సందర్భంగా బార్బీ ఫ్యామిలీ నుంచి మరికొన్ని వినూత్న బొమ్మలను విడుదల చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా వెల్లడించింది.
Know More