లేట్‌నైట్ పార్టీలు, మద్యపానంతో నా శరీరాన్ని, మనసును ఎంతో బాధపెట్టా!
మనం తీసుకునే ఆహారం అటు శారీరకంగానే కాదు.. ఇటు మానసికం గానూ ప్రభావం చూపుతుంది. అయితే ప్రస్తుతమున్న యాంత్రిక జీవనంలో చాలామంది ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం లేదు. పని ఒత్తిడిలో పడిపోయి కొందరు ఏ అర్ధరాత్రో తింటున్నారు. మరికొందరు సులభంగా దొరుకుతుందనే కారణంతో జంక్‌ఫుడ్‌కు అలవాటుపడుతున్నారు. ఇక లేట్ నైట్ ప్రోగ్రామ్స్, వీకెండ్ పార్టీలంటూ ఇంకొందరు ఏది పడితే అది తింటున్నారు. దీంతో తమకు తెలియకుండానే విపరీతంగా బరువు పెరిగిపోతుంటారు. ఈ క్రమంలో ఇలాంటి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగానే ఒకానొక సమయంలో విపరీతంగా బరువు పెరిగానంటోంది ప్రముఖ అమెరికన్ చెఫ్ మెలిస్సా కింగ్. అనారోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌తో లావెక్కిన తన శరీరాన్ని చూసి ఎంతో బాధపడ్డానని చెబుతోంది. ఇక ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలాంటి ఫలితం ఉండదన్న విషయం ఆలస్యంగా గ్రహించినా... అప్పట్నుంచి తన శరీరాన్ని తనకు నచ్చినట్లుగా మార్చుకున్నానంటోంది. ఈ క్రమంలో తన ఫ్యాట్ టు ఫిట్ జర్నీ గురించి సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకుందీ అందాల తార.
Know More