ముఖం పైన అలా కనిపించకూడదంటే ఏం చేయాలి?
వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో అతివల్ని ఎన్నో సౌందర్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అలాంటి వాటిలో చర్మ రంధ్రాలు పెద్దవిగా కనిపించడం కూడా ఒకటి. మనం ఉపయోగించే మేకప్‌లో ఉండే రసాయన పదార్థాలు, జిడ్డుదనం, సూర్యరశ్మి ప్రభావం, మొటిమలు.. వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలు. అయితే ఇలా చర్మ రంధ్రాలు పెద్దవవడం వల్ల ముఖ చర్మం పైన చిన్న చిన్న గుంతల్లాగా కనిపించడం, వయసు పైబడిన ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపించడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలన్నీ కొందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. అయితే వీటి పరిమాణాన్ని తగ్గించడం అసాధ్యమని, కాకపోతే వీటిని కనిపించకుండా చేసి నవయవ్వనంగా మెరిసిపోయేందుకు పలు సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలు అందుబాటులో ఉన్నాయంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..
Know More