ఇవి ఉంటే ఇక ఉప్పు, పప్పు కోసం వెతకక్కర్లేదు!
అయ్యో.. ఉప్పెక్కడ పెట్టానో కనిపించడం లేదే.. కప్‌బోర్డ్‌లో ఎక్కడో ఒకచోట ఉప్పు డబ్బా పెట్టడం, ఇలా రోజూ దాని గురించి వెతకడం ప్రత్యూషకు అలవాటే. నేహ తన కిచెన్‌లో పప్పులన్నీ ఒకే తరహా డబ్బాల్లో భద్రపరుస్తుంటుంది. అయితే అవి ట్రాన్స్పరెంట్గా లేకపోవడంతో ఏ పప్పు ఏ డబ్బాలో ఉందో పదే పదే మూత తీసి చూడాల్సిందే! రాగిణి ఆఫీసుకెళ్లే హడావిడిలో గిన్నెలన్నీ తోమి ఆదరాబాదరాగా ఓ టబ్‌లో వేసేస్తుంది. ఇక సాయంత్రం ఇంటికొచ్చాక అందులో టీ గిన్నె ఎక్కడుందో వెతుక్కోవడానికి రోజూ కాస్త సమయం వృథా అవుతుందంటోంది. ఇలా మనం కిచెన్‌ని ఎంత చక్కగా సర్దుకున్నా.. కొన్ని కొన్ని పదార్థాలు, వస్తువుల కోసం రోజూ వెతుక్కుంటూ ఉంటాం. మరి, ఇలాంటి కన్ఫ్యూజన్కి చెక్ పెట్టాలంటే ‘కిచెన్ ర్యాక్స్’ని మన వంటింట్లో భాగం చేసుకోవాల్సిందే! గరిటలు, గిన్నెల దగ్గర్నుంచి పప్పులు, స్పైసెస్.. వంటి పదార్థాల వరకు అన్నీ వేటికవే సెపరేట్‌గా అమర్చుకోవడానికి ప్రస్తుతం ఇలాంటి బోలెడన్ని మల్టీ పర్పస్ ర్యాక్స్ మార్కెట్లో అందుబాటులోకొచ్చేశాయి. ఏ ర్యాక్‌లో సర్దేవి ఆ ర్యాక్‌లో అరేంజ్ చేస్తే పని తగ్గడంతో పాటు సమయమూ ఆదా అవుతుంది.. అంతేనా.. కిచెన్ కూడా నీట్‌గా కనిపిస్తుంది.. పైగా వీటికంటూ ప్రత్యేకంగా కాస్త స్పేస్ కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. గోడలు, చిన్న చిన్న ఖాళీ ప్రదేశాల్లో ఇట్టే ఇమిడిపోయే ఇలాంటి కొన్ని విభిన్న కిచెన్ ర్యాక్స్/మల్టీ పర్పస్ ర్యాక్స్ గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..
Know More