‘కరోనా’ నుంచి అమ్మను కాపాడుకుందాం!
ప్రపంచమంతా ‘కొవిడ్-19’ నీలినీడలు కమ్ముకున్నాయి. మన దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తోన్న ఈ మహమ్మారి ప్రజల్ని మరింత భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఆరోగ్యవంతులే ఈ వైరస్ ధాటికి ఢీలా పడిపోతున్నారంటే.. ఇక రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే గర్భిణులు, పిల్లలు, వృద్ధుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. వీరిలోనూ ముఖ్యంగా మరో బిడ్డకు జన్మనివ్వబోయే గర్భిణులైతే ఈ వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం అంటున్నారు ప్రముఖ గైనకాలజీ నిపుణులు డా. సవితాదేవి. ఈ నేపథ్యంలో అసలేంటీ ‘కొవిడ్-19’? దీని బారిన పడకుండా గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ తల్లికి ఈ వైరస్ సోకితే బిడ్డకూ సంక్రమించే అవకాశాలున్నాయా? తదితర విషయాలను ‘వసుంధర.నెట్’కు వివరించారు.
Know More