గృహహింసకు వ్యతిరేకంగా సినిమాల్లో అలా చెప్పలేరా..!
‘సినిమా’.. మనిషి ఆలోచనలపై ప్రభావం చూపే, మనిషిని మంచి/చెడు మార్గాల వైపు ప్రేరేపించే అతి శక్తిమంతమైన మాధ్యమం. అందుకే ఓ సినిమాని చిత్రీకరించే ముందు ఎన్నో కోణాల నుంచి ఆలోచించి మరీ రూపొందిస్తుంటారు. సినిమా నేపథ్యం, టైటిల్, డైలాగ్స్, సన్నివేశాలు, పాటలు, దుస్తులు, సెట్స్.. ఇలా ఒక్కటేమిటి.. ప్రతి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. తమ సినిమా వల్ల సమాజానికి మేలు జరగకపోయినా ఫర్వాలేదు కానీ, చెడు మాత్రం జరగకూడదని కొంతమంది అభిరుచి కలిగిన ఉత్తమ దర్శకనిర్మాతలు భావిస్తుంటారు. అయితే పలు సందర్భాల్లో సినిమాల్లో కొన్ని సన్నివేశాలు కాస్త అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ కథా బలం కోసం వాటిని అలాగే ఉంచాల్సి వస్తుంటుంది. అప్పుడు వాటి కింద ‘డిస్క్లెయిమర్’ వేస్తుంటారు.
Know More