ఈ ‘తియ్యటి ఆవకాయ’ మీరూ ట్రై చేస్తారా?
వేసవి కాలం అనగానే మనకు గుర్తొచ్చే విషయాల్లో మామిడి కాయలు/పండ్లు కూడా ఒకటి. ఈ సీజన్లో వచ్చే పుల్లని మామిడి కాయలతో చేసే ఆవకాయ అంటే ఇష్టం లేని వారుంటారా చెప్పండి.. వేడివేడి అన్నం, మామిడికాయ పచ్చడి, మీగడ వేసుకొని తింటే.. ఆ రుచికి మరేదీ సాటిరాదని చెప్పడం అతిశయోక్తి కాదు. అందుకే ఓ సినిమాలో త్రివిక్రమ్ కూడా ‘అమ్మ, ఆవకాయ.. ఎప్పటికీ బోర్ కొట్టవు’ అంటాడు. మన పూర్వీకులు కనిపెట్టిన ఈ సంప్రదాయ రెసిపీ రుచికరమైందే కాదు.. ఎంతో ఆరోగ్యకరమైంది కూడా..! ఈ క్రమంలో కొణిదెల వారి కోడలు ఉపాసన ఇటీవలే తియ్యటి ఆవకాయ పచ్చడి తయారు చేసింది. ఈ విషయాన్ని తను ఇటీవలే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తను ఆవకాయ పెట్టడం జీవితంలో ఇదే మొదటిసారి అని చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఆవకాయ వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి కూడా వివరంగా తన బ్లాగ్లో వివరించింది మిస్సెస్ సి. మరి ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందామా..!
Know More