120 భాషల్లో పాటలు పాడేస్తోన్న అపర బాల మేధావి!
జ్ఞానమనేది అనంతమైనది.. ఎన్ని విద్యలు నేర్చినా, ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. అందుకే కొందరు ఎన్ని విషయాలు తెలిసినా, ఇంకా ఇంకా కొత్త విద్యలు నేర్చుకోవాలని తపన పడుతుంటారు. అద్భుతాలు సృష్టించాలని, అందరిలోనూ ప్రత్యేకంగా నిలవాలని ఆశపడుతుంటారు. ఇదిగో ఈ రెండో కోవకే చెందుతుంది భారత సంతతికి చెందిన పదమూడేళ్ల సుచేతా సతీష్. దాదాపు భారతీయ భాషలన్నింటిలో ప్రావీణ్యం సంపాదించి తన గాత్రంతో సంగీత ప్రేమికుల్ని ఓలలాడిస్తోన్న ఈ యంగ్స్టర్కు నేర్చుకోవాలన్న తపన రోజురోజుకీ రెట్టింపవుతోంది. అందుకు నిదర్శనమే తాజాగా తాను అందుకున్న ‘గ్లోబల్ ఛైల్డ్ ప్రొడిజీ (ప్రపంచ బాల మేధావి)’ అవార్డు. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషలపై కూడా పట్టు సాధించి.. ఇలా మొత్తంగా 120 భాషలు ఔపోసన పట్టడంతో పాటు అన్ని భాషల్లోనూ పాటలు పాడగల నైపుణ్యం సొంతం చేసుకున్నందుకే ఈ అవార్డు ఆమెను వరించింది. ఈ నేపథ్యంలో ఈ బాల మేధావి గురించి కొన్ని విశేషాలు మీకోసం..
Know More