దయచేసి బాలు గారు లేరని ఎవరూ అనకండి!
తన గానామృతంతో ఆబాల గోపాలాన్ని అలరించిన ఎస్పీ బాలు మరణాన్ని యావత్ భారతావని జీర్ణించుకోలేకపోతోంది. ఈ గాన గంధర్వుడి మధురమైన గాత్రాన్ని ఇక వినలేమనే వార్త సంగీతాభిమానులకు తీవ్ర శోకాన్ని మిగుల్చుతోంది. ఇక సినీ, సంగీత ప్రపంచంలో బాలుతో కలిసి ప్రయాణం చేసిన పలువురు తారలు, గాయనీమణులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగానికి గురువుతున్నారు. ఈక్రమంలో ప్రముఖ సింగర్ సునీత ఈ సంగీత చక్రవర్తితో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ ఫేస్బుక్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన ఆమె బాలు గురించి ఇలా చెప్పుకొచ్చారు.
Know More