పింక్ అంటే ఎంతిష్టమైతే మాత్రం.. మరీ ఇంతగానా?!
గులాబీ రంగు అంటే అమ్మాయిలకు ఎంతిష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ప్రతి ఒక్కరి దగ్గరా కనీసం ఒక్క పింక్ కలర్ అవుట్‌ఫిట్ అయినా ఉంటుంది. ఇదొక్కటనే కాదు.. తమకు ఇష్టమైన రంగుల్లో ఉండే దుస్తులు, యాక్సెసరీస్.. వంటివి తమ వార్డ్‌రోబ్‌లో చేర్చుకొని మురిసిపోతుంటారు అమ్మాయిలు. అలాగని అన్నీ ఒకే రంగులో ఉండవు.. సరికదా రోజూ ఒకే రంగు దుస్తులు వేసుకోవాలన్నా ఎవరికైనా బోరే! కానీ స్విట్జర్లాండ్‌కు చెందిన 32 ఏళ్ల యాస్మిన్ చార్లొట్‌కు మాత్రం అస్సలు బోర్ కొట్టదట. రోజూ తాను పింక్ కలర్ దుస్తులు తప్ప మరేవీ ధరించనంటోంది. ఒక్క దుస్తులనే కాదు.. యాక్సెసరీస్ దగ్గర్నుంచి తన ఇల్లు, ఇంట్లోని వస్తువులు, మేకప్ సామగ్రి.. ఇలా అన్ని వస్తువుల్నీ పింక్ కలర్లో ఉన్నవి తప్ప మరేవీ ఎంచుకోవట్లేదామె. మరి ఎందుకిలా అని అడిగితే గులాబీ రంగు అంటే తనకు చెప్పలేనంత ఇష్టమంటూ తన గురించి బోలెడన్ని విషయాలు ఇలా పంచుకుంది.
Know More