సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

పెళ్లి మన జీవితాన్ని ఇంకా బెటర్‌గా మార్చాలి!

అనసూయా భరద్వాజ్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. సినిమా స్టార్స్‌తో సమానంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించు కుందీ క్రేజీ యాంకర్‌. బుల్లితెరపై తన హవా కొనసాగిస్తూనే.. వెండితెరపై కూడా అవకాశాలు దక్కించుకుంటూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ అందాల తార. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన అనసూయ.. అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా టచ్‌లోనే ఉంటోంది. తాజాగా #askanasuya పేరుతో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ట్విట్టర్‌ వేదికగా సమాధానాలు చెప్పిందీ బ్యూటిఫుల్‌ యాంకర్‌.. ఇంతకీ, ఆ ప్రశ్నలేంటి? దానికి అను చెప్పిన సమాధానాలేంటో చూద్దాం రండి..

Know More

women icon @teamvasundhara

ఈ క్వారంటైన్‌ లవ్‌ ప్రపోజల్‌ చూశారా?

కరోనా మనుషుల మధ్య సామాజిక దూరం పెంచిందేమో కానీ.. వారి మధ్య ఉండే ప్రేమానురాగాల్ని ఏమాత్రం తగ్గించలేకపోయింది. అయితే కరోనా విజృంభిస్తోన్న ఈ తరుణంలో లాక్‌డౌన్‌ కారణంగా రోజంతా ఇంట్లో గడపలేక ఇబ్బందులు పడుతోన్న వారు కొందరైతే.. సరైన ప్రణాళిక ఉంటే ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని మన మనసుకు నచ్చినట్లు ఎంజాయ్‌ చేయొచ్చు అని నిరూపిస్తున్నారు మరికొందరు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో గడపడం, పాత స్నేహాలను గుర్తు చేసుకొని వారిని పలకరించడం, ఇంటి పనుల్లో పాల్గొనడం, అభిరుచులపై దృష్టి పెట్టడం, కొత్త విషయాలు తెలుసుకోవడం.. మొదలైనవి చేస్తున్నారు. అంతేకాదు, తమ అనుభవాలు, ఆనందాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు కూడా! ఈ క్రమంలో ఓ ప్రేమికుడు తన ప్రేయసికి స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. ప్రపంచమంతా సామాజిక దూరం పాటిస్తోన్న ఇలాంటి పరిస్థితుల్లో అతడికి ఇది ఎలా సాధ్యమైందనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి.

Know More

women icon @teamvasundhara

అప్పట్నుంచే నేను స్వీయ నిర్బంధంలో ఉంటున్నా!

వృత్తిపరంగా, వ్యక్తిగతంగా క్షణం కూడా తీరిక లేకుండా.. నిత్యం ఉరుకులు పరుగులతో సాగుతోన్న మనిషి హైస్పీడ్‌ జీవన విధానానికి కరోనాతో ఒక్కసారిగా సడెన్‌ బ్రేక్‌ పడినట్లయ్యింది. దీంతో ఎక్కువశాతం మంది ఇంటి పట్టునే ఉంటూ కాలక్షేపమే వృత్తిగా పెట్టుకుంటున్నారు. అరుదుగా లభించే ఇలాంటి అవకాశాన్ని తమ మనసుకు నచ్చిన పనులు చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు ఈ క్వారంటైన్‌ సమయాన్ని ఎలా గడుపుతోందో ఇటీవల ఓ ఇంటర్వూ ద్వారా చెప్పుకొచ్చింది. మరి ఆ విశేషాలేంటో మనమూ చూసేద్దామా..!

Know More

women icon @teamvasundhara

కష్ట సమయాల్లో ఇష్టమైనవి గుర్తు తెచ్చుకోండి..!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే సినీ తారలు సైతం ఇంటిపట్టునే ఉంటూ.. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడిపేందుకు కేటాయిస్తున్నారు. అంతేకాదు, వీలు కుదిరినప్పుడల్లా సోషల్‌ మీడియా లైవ్‌/చాట్‌ ద్వారా తమ అభిమానులను పలకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అందాల భామ పూజా హెగ్డే కూడా తాజాగా ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. #AskPooja అనే హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా నెటిజన్లు అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలిచ్చిందీ ‘బుట్టబొమ్మ’.

Know More

women icon @teamvasundhara

ఇప్పుడు నాకు అవే ముఖ్యమనిపిస్తోంది..!

కరోనా వ్యాప్తిని అరికట్టే టీకా కోసం పరిశోధకులు, వైద్యులు విపరీతంగా శ్రమిస్తున్నారు. అయితే స్వీయ నిర్బంధం, సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం.. ఈ మూడు మార్గాలే మనల్ని కరోనా బారిన పడకుండా రక్షిస్తాయన్న విషయం తెలిసిందే. అందుకే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు వీటిని తు.చ. తప్పకుండా పాటిస్తున్నాయి. సామాన్యుల నుంచి దేశ ప్రధానుల వరకు స్వీయ నిర్బంధం పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో రోజుల కొద్దీ ఇంట్లో గడపడుతుండడంతో ప్రజల ఆలోచన తీరులో క్రమంగా మార్పు వస్తోంది. ఇంతకాలం వృత్తిగత, వ్యక్తిగత జీవితాలతో బిజీగా గడిపిన చాలామందికి ఈ లాక్‌డౌన్‌ సమయం తమ గురించి తాము తెలుసుకునేందుకు ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు గడిచిన క్వారంటైన్‌ సమయం తన ఆలోచన తీరులో ఎలాంటి మార్పును తీసుకొచ్చిందో తాజాగా సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కా శర్మ.

Know More

women icon @teamvasundhara

ఈ లాక్ డౌన్ నాకెన్నో విషయాలు నేర్పింది!

కరోనా వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కానీ, ఈ వైరస్‌ మనుషుల ఆలోచన తీరులో ఎన్నో రకాల మార్పులు తీసుకొస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. స్వీయ నియంత్రణలో గడుపుతోన్న వారిలో ఎక్కువశాతం మంది ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని తమకు అభిరుచి ఉన్న పనులు చేయడానికి.. తమ గురించి తమకు తెలియని విషయాలను తెలుసుకునేందుకు ఉపయోగిస్తుండడం విశేషం. ఈ క్రమంలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ ఈ లాక్‌డౌన్‌ సమయంలో తను నేర్చుకున్న విషయాలను ఓ సుదీర్ఘ ఉత్తరం రూపంలో ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది.

Know More

women icon @teamvasundhara

సామాజిక దూరం పాటిస్తూనే సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చారు..!

ఎదుటివారికి ప్రేమను పంచాలనే మనసుండాలే కానీ, ప్రకృతి విపత్తులు సైతం వారికి అడ్డుగా నిలబడలేవు..! దీనికి ఉదాహరణగా నిలిచే ఓ సంఘటనే ఇటీవల అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన జాన్‌ క్రసిన్స్‌కి అనే నటుడు ‘ఈ వారంలో మీకు ఎదురైన స్ఫూర్తిదాయక కథ లేదా మిమ్మల్ని ఆనందానికి గురి చేసిన సంఘటనలను నాతో పంచుకోండి’ అంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్‌పై చాలామంది నెటిజన్లు స్పందించారు. కానీ, వీరిలో ఏప్రిల్‌ డాన్జ్‌ అనే మహిళ షేర్‌ చేసిన ఓ వీడియో జాన్‌తో పాటు నెటిజన్లను సైతం విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి ఆ వీడియో ఏంటి..? దాని వెనకున్న కథేంటో మనమూ చూసేద్దామా..!

Know More

women icon @teamvasundhara

ఆమె సేవలకు కాలనీ అంతా చప్పట్ల వర్షం కురిసింది!

కరోనా ఆడుతోన్న విలయ తాండవానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ మహమ్మారి బారిన పడకుండా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు స్వీయ నిర్బంధంలో ఉంటూ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. కానీ, అత్యవసర సేవల కోసం కొన్ని రంగాలకు చెందిన వాళ్లు మాత్రం తమ విధుల్లో కొనసాగుతున్నారు. వీరిలో వైద్య రంగానికి చెందిన డాక్టర్లు, నర్సులు, కాంపౌండర్లు.. తదితర సిబ్బంది కూడా ఉన్నారు. వీళ్లు కరోనా లేదా ఇతర రోగాలతో ఆసుపత్రుల్లో చేరుతోన్న రోగులకు వైద్య సేవలందించేందుకు పగలు, రాత్రి అనే తేడాల్లేకుండా నిరంతరం పని చేస్తున్నారు. ముఖ్యంగా కొవిడ్‌-19 లక్షణాలున్న వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు వీళ్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ మహమ్మారితో పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో యూకేలో పారామెడిక్‌ (ఎమర్జెన్సీ కేర్‌ అసిస్టెంట్‌)గా సేవలందిస్తోన్న ఓ యువతి డ్యూటీకి వెళ్తుండగా తన కాలనీ వాసులంతా ఇంటి నుంచి బయటకు వచ్చి చప్పట్లతో ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala