అక్కినేని వారి ఫ్యామిలీ చెఫ్ ఎవరో తెలుసా?
సాధారణంగా ఇంట్లో ఎవరు వంట చేస్తారు? అదేం ప్రశ్న.. ఆడవాళ్లు చేస్తారు.. కొన్ని పనుల్లో మగవాళ్లు కూడా వాళ్లకు సహాయపడతారు.. అంటారా? అవుననుకోండి.. కానీ ఆ ఇల్లాలికి వంట రాకపోతే? ఓ వంట మనిషిని పెట్టుకుంటుంది.. లేదంటే తనే ఎలాగోలా నేర్చుకొని వండుతుంది. మరి, అదే సెలబ్రిటీలైతే ఏకంగా చెఫ్లనే నియమించుకుంటారు. అందులోనూ సినిమా రంగానికి చెందిన వాళ్లైతే తమ ఫిట్నెస్ తగ్గకుండా, చక్కటి పోషకాహారాన్ని రుచికరంగా వండి వార్చే చెఫ్‌లకు అధిక ప్రాధాన్యమిస్తారు. అక్కినేని వారింట్లో కూడా అలాంటి చెఫ్ ఉన్నారన్న విషయం ఈమధ్యే అఖిల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటో చూస్తే గానీ చాలామందికి తెలియలేదు. అమలకు వంట రాదు.. మరి వాళ్లింట్లో వంట ఎవరు చేస్తారు? అన్న చాలామంది సందేహానికి ఈ ఫొటో సమాధానమిచ్చినట్లయింది. మరి, ఇంతకీ ఎవరా చెఫ్? ఇప్పటిదాకా తెర వెనకే ఉన్న ఆమె ఉన్నట్లుండి తెర ముందుకు ఎందుకొచ్చింది? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!
Know More