సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ ఆమె ఆలోచనలే.. నాలో తప్పులు వెతుకుతాడు.. ఏం చేయాలి?

హాయ్‌ మేడమ్‌.. మాకు పెళ్లై ఐదు సంవత్సరాలవుతోంది. నా భర్త పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించారు. కులాలు వేరు కావడంతో పెద్దవాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. ఎప్పుడూ ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తుంటారు.. ఒక్కోసారి ఏడుస్తారు కూడా. ఇదిలా ఉంటే దీనికి తోడు తనకు పరిచయమున్న ఇతర అమ్మాయిలను రెస్టారంట్లకు తీసుకువెళ్తుంటారు. నన్ను మాత్రం కనీసం పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి సందర్భాల్లో కూడా బయటకు తీసుకెళ్లరు. దూరం ఎక్కువని ఆఫీస్ దగ్గరే రూమ్‌ తీసుకుని ఉంటున్నారు. మమ్మల్ని కూడా తీసుకెళ్లమంటే ‘మా అమ్మ ఇక్కడ వాతావరణానికి అలవాటు పడింది.. మీరు ఇక్కడే ఉండండి’ అంటున్నారు. ఇంట్లో ఖర్చులకు ఎలాంటి లోటూ చేయడు. కానీ, ఇంటికి వచ్చినప్పుడు నాతో సంతోషంగా ఉండడు. ఎప్పుడూ ఏదో ఒక తప్పు చూపిస్తాడు. ఒకవేళ ఎలాంటి తప్పు చేయకపోయినా కావాలని గొడవ పడతాడు. అమ్మాయిలతో గంటల కొద్దీ మాట్లాడతాడు. ఉదయం అయిదింటికి లేచి పనంతా చేయాలని తిడతారు. ఒకవేళ చేయకపోతే నీళ్లు మీద పోస్తారు. మా పుట్టింటికి వెళ్లి నాలుగు రోజులు ఉండాలనిపిస్తుంటుంది. కానీ పంపడు. ఒకవేళ పంపినా ఉదయం వెళ్లి సాయంత్రానికి వచ్చేయమంటారు. తను మాత్రం స్నేహితులతో ట్రిప్‌లకి వెళ్తారు. నాకు ఒక బాబు ఉన్నాడు. అందుకే ఏం చేయలన్నా ఆలోచిస్తున్నా.. దయచేసి సలహా ఇవ్వగరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ప్రతి రోజూ ఆ కాఫీ.. ఆ జ్యూస్.. ఎందుకో తెలుసా?

కరోనా వచ్చాక అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగిపోతోంది. ఈ మహమ్మారి బారిన పడకూడదని ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా చాలామంది తమకు తెలిసిన ఇంటి చిట్కాలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రత్యేకించి ఆహారం విషయంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇంట్లో వండిన పదార్థాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అది కూడా పోషకాలు పుష్కలంగా లభించే వాటికే ఓటేస్తున్నారు. అలాంటి వారందరికీ తన మార్నింగ్‌ రొటీన్‌ని పరిచయం చేసింది బాలీవుడ్‌ బ్యూటీ హీనా ఖాన్‌. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో తాను పాటిస్తోన్న ఈ అలవాట్లతో అందంతో పాటు ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చంటోంది. ఈ క్రమంలో తన రోజు మొదలయ్యే తీరు గురించి తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon @teamvasundhara

సోనమ్‌ చెప్పిన ఈ చాక్లెట్‌ స్మూతీని మీరూ ట్రై చేయండి!

క్యాలరీలు, కెఫీన్‌ అధికంగా ఉండే డార్క్‌ చాక్లెట్‌ తింటే బరువు పెరుగుతారన్న అపోహ చాలామందిలో ఉంటుంది. అందుకే నోరూరిస్తున్నా చాలామంది వీటిని తినకుండా తమ నోరు కట్టేసుకుంటుంటారు. అయితే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉండే ఈ చాక్లెట్‌ స్మూతీని తన బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకుంటానంటోంది బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్‌. పీసీఓఎస్‌ సమస్య కారణంగా గత కొన్నేళ్లుగా చక్కెర పదార్థాలకు దూరంగా ఉంటోందీ అందాల తార. ఈ క్రమంలో తాను ఉదయాన్నే తీసుకునే షుగర్‌ ఫ్రీ చాక్లెట్‌ స్మూతీ తయారీ విధానాన్ని ఇన్‌స్టా స్టోరీస్‌ ద్వారా అందరితో షేర్‌ చేసుకుందీ ముద్దుగుమ్మ.

Know More

women icon @teamvasundhara

ఇది కూడా నా అందానికి కారణమే!

పర్యావరణ కాలుష్యం మన ఆరోగ్యాన్నే కాదు.. అందాన్నీ దెబ్బతీస్తుంది. వాతావరణంలోని దుమ్ము-ధూళి, ఇతర కాలుష్య కారకాలు.. వంటివి చర్మ రంధ్రాల్లోకి చేరిపోయి మృతకణాలు, మొటిమలు ఏర్పడడం మనకు తెలిసిందే. అయితే ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందేందుకు బయట దొరికే సౌందర్య ఉత్పత్తుల కంటే ఇంట్లో తయారుచేసుకునే సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలే మేలంటోంది బాలీవుడ్‌ అందాల తార మలైకా అరోరా. తన అందాన్ని సంరక్షించుకోవడానికి అమ్మ చెప్పిన చిట్కాల్నే పాటిస్తున్నానంటోన్న ఈ ముద్దుగుమ్మ.. వాటిని సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతోనూ పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో బ్యూటీ టిప్‌ని మన ముందుకు తీసుకొచ్చింది మలైకా. మరి, అదేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

హవాయ్ మగువల బ్యూటీ సీక్రెట్స్‌ ఇవే !

అందంగా ఉండడానికి రెండు పద్ధతులున్నాయి. ఒకటి.. చర్మ ఛాయ, ముఖకవళికలు ఎలా ఉన్నా వాటిని మేకప్‌తో కవర్ చేసి అందంగా మెరిసిపోవడం.. రెండోది.. లోలోపలి నుంచి చర్మాన్ని మెరిపించుకుంటూ సహజసిద్ధమైన సౌందర్యాన్ని సొంతం చేసుకోవడం. తాము మాత్రం తమ సౌందర్యానికి మెరుగులు దిద్దుకోవడానికి రెండో పద్ధతినే ఆశ్రయిస్తామంటున్నారు హవాయ్ మగువలు. తాత్కాలిక అందాన్ని అందించే మేకప్ ఉత్పత్తుల కంటే సహజమైన పదార్థాలతో వచ్చిన నిగారింపు ఎప్పటికీ నిలిచి ఉంటుందని, అది తమ విషయంలో రుజువైందని నిరూపిస్తున్నారీ దేశపు అతివలు. మరి, ఈ నేపథ్యంలో హవాయ్ మహిళల శాశ్వతమైన అందం వెనకున్న ఆ సహజమైన సౌందర్య సాధనాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఈ ‘కాఫీ ఫేస్’ మాస్క్ తో నవ యవ్వనం మీ సొంతం!

మచ్చలేని చందమామల్లా మెరిసిపోతుంటారు మన ముద్దుగుమ్మలు. మరి, ఆ అందానికి కారణం మేకప్‌ అనుకుంటాం.. కానీ ఇంటి చిట్కాలతోనే కుందనపు బొమ్మల్లా మెరిసిపోవచ్చని నిరూపిస్తున్నారు కొందరు నటీమణులు. ఈ క్రమంలోనే తాము పాటించే సౌందర్య చిట్కాలను ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటారు. బాలీవుడ్‌ యువ కథానాయిక అలయా ఫర్నిచర్‌వాలా కూడా తన సౌందర్య రహస్యమేంటో తాజాగా ఇన్‌స్టా పోస్ట్‌ రూపంలో పంచుకుంది. ఈ ఏడాది ‘జవానీ జానేమన్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ అందాల తార.. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్‌ ఏమీ లేకపోవడంతో ఇంట్లోనే ఉంటోంది. అలాగని ఖాళీగా కూర్చోకుండా విభిన్న వంటకాలు చేస్తూ, వ్యాయామాలు చేస్తూ.. ఆ ఫొటోలు, వీడియోలను తన ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఇక ఇప్పుడు తన సౌందర్య రహస్యమేంటో చెప్తూ మరో పోస్ట్‌ పెట్టిందీ క్యూట్‌ బ్యూటీ.

Know More

women icon @teamvasundhara

96 కిలోల పిజ్జా గర్ల్‌ నుంచి ఫిట్టెస్ట్‌ గర్ల్‌గా ఇలా మారా!

సాధారణంగా చబ్బీగా ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో పంచుకోవడానికి చాలామంది ఇష్టపడరు. వాటిని చూసి ఎవరెలా స్పందిస్తారో అని వెనకడుగు వేస్తుంటారు. కానీ కొందరు ముద్దుగుమ్మలు మాత్రం ఇందుకు భిన్నం. ‘ఎవరేమనుకుంటే మాకేంటి.. మా శరీరం మా ఇష్టం..’ అంటూ తాము గతంలో లావుగా ఉన్న ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడానికి ఏమాత్రం వెనకాడరు. మన పటౌడీ ప్రిన్సెస్‌ సారా అలీ ఖాన్‌ కూడా ఇదే కోవలోకి వస్తుంది. సినిమాల్లోకి రాకముందు 96 కిలోల బరువుతో చబ్బీగా ఉండే సారా.. ఆపై కఠోరమైన కసరత్తులు చేసి మల్లెతీగలా మారిపోయింది.

Know More

women icon @teamvasundhara

కాఫీ పిప్పిని ఇలా కూడా వాడచ్చు..!

ఉదయాన్నే లేచి కాఫీ తాగుతూ బద్ధకాన్ని వదిలించుకొనే అలవాటున్న వారు చాలామందే ఉంటారు. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి.. తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కూడా కాఫీని ఆశ్రయించేవారు బోలెడంతమందే..! కాఫీ తాగడం వరకు బాగానే ఉంది.. కానీ వాడేసిన కాఫీ పొడిని వృథాగా పడేస్తూ ఉంటారు చాలామంది. అయితే ఈసారి మాత్రం అలా చేయకండి.. ఎందుకంటే కాఫీ వడకట్టగా మిగిలిన పిప్పిని పెరటి మొక్కలకు ఎరువుగా, కీటకనాశనిగా ఉపయోగించుకోవచ్చు. ఇటీవలి కాలంలో టెర్రస్, బాల్కనీలతో పాటు ఇంట్లోనూ మొక్కలను పెంచుతున్నారు. ఇలాంటి మొక్కలకు రసాయనిక ఎరువులు ఉపయోగిస్తే వాటి ప్రభావం వల్ల మొక్కలకే కాదు.. మన ఆరోగ్యానికీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అందుకే వాటికి సహజసిద్ధమైన ఎరువులు ఉపయోగించడం మంచిది. దీనికోసం ఒకసారి వాడిన కాఫీ పొడి బాగా ఉపయోగపడుతుంది. అదెలాగో తెలుసుకుందాం రండి..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

హాయ్‌ మేడమ్‌.. మాకు పెళ్లై ఐదు సంవత్సరాలవుతోంది. నా భర్త పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించారు. కులాలు వేరు కావడంతో పెద్దవాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. ఎప్పుడూ ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తుంటారు.. ఒక్కోసారి ఏడుస్తారు కూడా. ఇదిలా ఉంటే దీనికి తోడు తనకు పరిచయమున్న ఇతర అమ్మాయిలను రెస్టారంట్లకు తీసుకువెళ్తుంటారు. నన్ను మాత్రం కనీసం పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి సందర్భాల్లో కూడా బయటకు తీసుకెళ్లరు. దూరం ఎక్కువని ఆఫీస్ దగ్గరే రూమ్‌ తీసుకుని ఉంటున్నారు. మమ్మల్ని కూడా తీసుకెళ్లమంటే ‘మా అమ్మ ఇక్కడ వాతావరణానికి అలవాటు పడింది.. మీరు ఇక్కడే ఉండండి’ అంటున్నారు. ఇంట్లో ఖర్చులకు ఎలాంటి లోటూ చేయడు. కానీ, ఇంటికి వచ్చినప్పుడు నాతో సంతోషంగా ఉండడు. ఎప్పుడూ ఏదో ఒక తప్పు చూపిస్తాడు. ఒకవేళ ఎలాంటి తప్పు చేయకపోయినా కావాలని గొడవ పడతాడు. అమ్మాయిలతో గంటల కొద్దీ మాట్లాడతాడు. ఉదయం అయిదింటికి లేచి పనంతా చేయాలని తిడతారు. ఒకవేళ చేయకపోతే నీళ్లు మీద పోస్తారు. మా పుట్టింటికి వెళ్లి నాలుగు రోజులు ఉండాలనిపిస్తుంటుంది. కానీ పంపడు. ఒకవేళ పంపినా ఉదయం వెళ్లి సాయంత్రానికి వచ్చేయమంటారు. తను మాత్రం స్నేహితులతో ట్రిప్‌లకి వెళ్తారు. నాకు ఒక బాబు ఉన్నాడు. అందుకే ఏం చేయలన్నా ఆలోచిస్తున్నా.. దయచేసి సలహా ఇవ్వగరు. - ఓ సోదరి

మీ
భర్త మనసులో మరొక వ్యక్తి ఉన్నా.. అది సాధ్యం కాకపోవడంతో మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడన్న విషయం మీకు తెలుసు. అతను తన పాత స్నేహితురాలిని మర్చిపోవడం సంగతి అటుంచితే.. తనకు మహిళల పట్ల బలహీనత ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అమ్మాయిలతో గంటల కొద్దీ మాట్లాడడం, వారిని బయటకు తీసుకెళ్లడం, ఆఫీస్ దగ్గరే ఒంటరిగా రూం తీసుకుని ఉండడం వంటి విషయాలను ప్రస్తావించారు. ఇవన్నీ మీకు అతనిపై నమ్మకం ఉన్నట్లుగా సూచించడం లేదు. ఒకవైపు ఇంటి అవసరాలకు ఎలాంటి లోటూ చేయడం లేదని చెబుతూనే మరోవైపు మిమ్మల్ని వేధిస్తున్నాడని చెబుతున్నారు. అలాగే బాబు ఉన్నాడు కాబట్టి అతని మీద ఆధారపడక తప్పదన్న ఆలోచనతో మీరు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఈ క్రమంలో మీకు మీరు స్వయంశక్తిని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. మీ ఉత్తరంలో మీ విద్యార్హతల గురించి ప్రస్తావించలేదు. అయితే ఈ రోజుల్లో ఇంట్లోనే ఉండి విద్యార్హతలను పెంచుకునే అవకాశాలెన్నో ఉన్నాయి. కాబట్టి, ఉద్యోగానికి తగ్గ విద్యార్హతలను పెంచుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీ కాళ్ల మీద మీరు నిలబడడమే కాకుండా మీ బాబుని మీరు చూసుకోగలరన్న ధైర్యం కూడా మీకు కలుగుతుంది. ఒక్కసారి ఉద్యోగం/వ్యాపారం అంటూ మొదలుపెట్టిన తర్వాత మీరు ప్రపంచాన్ని చూసే కోణంలో కూడా మార్పు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా మీపై మీకు ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా.. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం కూడా వచ్చే అవకాశాలుంటాయి.
ఇక, మీరు చేసే పనుల్లో లోపాలు వెతకడం, మీద నీళ్లు పోయడం వంటి పనుల వల్ల ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. అయితే అతని ప్రవర్తన వల్ల మీరు ఎంతగా బాధపడుతున్నారో అతనికి మీరు స్వయంగా ఎప్పుడైనా చెప్పారో లేదో మీరు స్పష్టం చేయలేదు.. ఒకవేళ దాని గురించి అతనితో ఇప్పటివరకు డైరెక్ట్ గా మాట్లాడకపోయుంటే - అతని అనుచిత ప్రవర్తన మీకు ఎంత బాధ కలిగిస్తోందో ఓసారి వివరంగా చెప్పి చూడండి.
అప్పటికీ మార్పు లేకపోతే మీ పరిస్థితుల గురించి పెద్దవాళ్లతో చర్చించడం ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశం ఉండచ్చు. ఆ దిశగా కూడా ఓసారి ప్రయత్నించి చూడండి. అదేవిధంగా సాధ్యమైనంత త్వరగా మీ కాళ్ల పైన మీరు నిలబడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఏ పరిస్థితి ఎలా వచ్చినా అతని పైన ఆర్ధికంగా ఆధారపడే అవసరం ఉండదు. మీ భవిష్యత్తు గురించి ధైర్యంగా నిర్ణయం తీసుకోగలుగుతారు.
0 Likes
Know More

Movie Masala