కరోనా వ్యాక్సిన్ ముందు, తర్వాత.. ఏవి తినాలి? ఏవి తినకూడదు?!
ఓవైపు కరోనా తన పని తాను చేసుకుపోతుంటే.. మరోవైపు దీని బారిన పడకుండా ఉండేందుకు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. రెండో దశ వ్యాక్సినేషన్లో భాగంగా అరవై పైబడిన వారితో పాటు, 45 ఏళ్లు దాటిన వారికి కూడా టీకా ఇస్తోన్న సంగతి తెలిసిందే! అయితే ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయోనన్న భయం కొంతమందిలో ఉంటే.. అసలు వ్యాక్సిన్కి ముందు, తర్వాత ఏవైనా ప్రత్యేక ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుందేమోనన్న సందేహం మరికొంతమందిలో ఉంది. ‘మీ సందేహం నిజమేనంటున్నారు’ నిపుణులు. ఎందుకంటే టీకా వేసుకోవడానికి ముందు, వేసుకున్న తర్వాత కొన్ని రకాల పదార్థాల్ని తీసుకోవడం వల్ల వ్యాక్సిన్ వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలను చాలా వరకు తగ్గించచ్చంటున్నారు. మరి, ఇంతకీ ఏంటా ఆహార నియమాలు? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!
Know More