అందుకే వీళ్లు నిజమైన ‘కరోనా యోధులు’ !
కరోనా విజృంభణను అదుపు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నాయి. కానీ, ఎక్కువ జనాభా, జనసాంద్రత కలిగిన మన దేశంలో ప్రజలను కరోనా నుంచి కాపాడగలిగే సూత్రం ‘లాక్డౌన్’ ఒక్కటే..! అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అత్యవసర విభాగాలకు చెందిన ఎంతోమంది ఉద్యోగులు పగలు, రాత్రి అనే తేడాల్లేకుండా పని చేస్తుంటే.. వారితో పాటు ప్రజలకు సేవలందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు మరికొందరు. ఈ క్రమంలో ఇలాంటి వాళ్ల గురించి, సమాజానికి వారు చేస్తోన్న సేవా కార్యక్రమాల గురించి సోషల్ మీడియా వేదికగా ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది NITI (National Institution for Transforming India) Aayog సంస్థ. మరి, ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందామా..!
Know More