నదీ జలాల సాక్షిగా వంతెన పైనే ఒక్కటయ్యారు!
పెళ్లంటే జీవితంలో ఒకేసారి వచ్చే పండగ. రెండు జీవితాలు ఒక్కటయ్యే ఈ వేడుకను ఎంతో ఆనందంగా, అట్టహాసంగా, అందరికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఆనందంగా ఏడడుగులు నడవాలనుకుంటారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రస్తుతం పెళ్లిళ్లకు సంబంధించిన ప్రణాళికలన్నీ మారిపోయాయి. వధువు ఒక చోట, వరుడు మరో చోట ఉంటే ఫోన్‌కే తాళి కట్టి పెళ్లైందనిపించే రోజులొచ్చాయి. అంతేనా వధూవరులిద్దరూ ఒకే చోట ఉండి, కుటుంబ సభ్యులు వేరే ప్రాంతాల్లో ఉంటే వీడియో కాలింగ్ యాప్స్ ద్వారా అందరినీ ఒక్కచోట చేర్చి మరీ అక్షింతలు వేయించుకుంటున్నాయి కొన్ని జంటలు. ఈ క్రమంలో అమెరికా-కెనడాలకు చెందిన ఓ జోడీ కూడా ఇలాగే వినూత్న పద్ధతిలో వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది.
Know More