కపూర్ సిస్టర్స్ డ్యాన్స్ అదుర్స్!
మాఘ మాసం మొదలు కావడంతో ప్రస్తుతం దేశమంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎక్కడ చూసినా బాజా భజంత్రీలే, పెళ్లిళ్ల ఫంక్షన్ల హడావిడే కనిపిస్తోంది. ఇక సెలబ్రిటీల ఇళ్లల్లో జరిగే ‘పెళ్లి సందడి’ మామూలుగా ఉండడం లేదు. సుందరంగా తీర్చిదిద్దిన వివాహ వేదికలు, సంగీత్‌లు, బారాత్‌లు, హల్దీ-మెహెందీ.. లాంటి ఫంక్షన్లతో ఫుల్ హంగామాతో ప్రముఖుల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కరీనా సోదరుడు, బాలీవుడ్ నటుడు అర్మాన్ జైన్, అనీసా మల్హోత్రాల వివాహం ముంబై వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. ఆద్యంతం కన్నుల పండువలా సాగిన ఈ శుభకార్యానికి కరీనా, కరిష్మాతో పాటు ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
Know More