నా జీవితంలో జరుపుకొన్న తొలి హోలీ ఇదే..!
పదిమంది జరుపుకొనేది పండగ కాదు..! పదిమంది కలిసి జరుపుకొనేదే పండగ..! ఈ మాటను తు.చ తప్పకుండా పాటించే వారిలో ముకేష్ అంబానీ కుటుంబం కూడా ఒకటి. వినాయక చవితి, దీపావళి, న్యూ ఇయర్.. ఇలా పండగేదైనా స్నేహితులు, బంధువులను తమ ఇంటికి ఆహ్వానించి, వాళ్లతో కలిసి ఆనందంగా జరుపుకోవడం అంబానీ ఫ్యామిలీ స్టైల్. అయితే అంబానీ వారసులు కూడా ఇప్పుడు ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ముకేశ్, నీతూ అంబానీల ముద్దుల కుమార్తె ఈషా అంబానీ ఇటీవల హోలీ పండగ సంబరాల్ని ఘనంగా నిర్వహించింది. శుక్రవారం జరిగిన ఈ వేడుకలో అంబానీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం పాల్గొనడం విశేషం.
Know More