సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

కోటి రూపాయలు గెలుచుకుని భర్త కలను నిజం చేసింది!

కౌన్‌ బనేగా కరోడ్‌ పతి... సామాన్యులను లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారుస్తూ వారి ఆశలు, ఆశయాలను సాకారం చేస్తున్న ప్రముఖ టీవీ షో. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ బుల్లితెర కార్యక్రమానికి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఈ షో ద్వారా వచ్చిన ప్రైజ్‌మనీ, క్రేజ్‌తో ఇప్పటికే ఎంతోమంది తమ కలలను నిజం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న 12వ సీజన్‌లో ఓ ఐపీఎస్‌ ఆఫీసర్‌ కోటి రూపాయలు గెలుచుకుని తన భర్త కలను సాకారం చేశారు.. వార్తల్లో మహిళగా నిలిచారు. మరి, ఇంతకీ ఎవరామె? తన భర్త కల ఏంటి? దానిని ఆమె ఎలా నెరవేర్చారు? తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

Know More

women icon @teamvasundhara

ప్రసవానంతర సెలవులు వద్దని.. చంటిబిడ్డతో డ్యూటీకి కదిలింది!

పెళ్లయిన మహిళలకు ఇంటి పని, వంట పని, పిల్లల ఆలనా పాలనా చూసుకోవడం...ఇలా పలు రకాల బాధ్యతలుంటాయి. ఇక ఉద్యోగం చేసే ఆడవాళ్ల పరిస్థితి అయితే మరింత క్లిష్టంగా ఉంటుంది. ఒకవైపు ఇంటి బాధ్యతలు..మరోవైపు ఆఫీస్‌ పనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిగత జీవితాన్ని... సమానంగా, సమర్థంగా బ్యాలన్స్‌ చేయాల్సి ఉంటుంది. ఈక్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా అధికారిణి తల్లి ప్రేమను చాటుకుంటూనే వృత్తి నిబద్ధతను పాటిస్తోంది. మాతృత్వం, వృత్తి ధర్మం తనకు రెండు కళ్లలాంటివి అని చెబుతోన్న ఈ కరోనా వారియర్‌ గురించి మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

అర్ధరాత్రి పూట వాళ్ల ఆకలి తీర్చిన ఆఫీసరమ్మ!

ఆమె ఓ జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారి... వైరస్‌ వ్యతిరేక పోరులో భాగంగా చీకటి పడే వరకు విధులు నిర్వర్తించింది. డ్యూటీ ముగించుకుని అప్పుడే ఇంటికి చేరుకుంది. విధి నిర్వహణలో బాగా అలసిపోవడంతో నిద్రకు ఉపక్రమించింది. అయితే అర్ధరాత్రి సమయంలో ఆమెకు ఓ ఫోన్‌ వచ్చింది. ‘అమ్మా ఆకలేస్తోంది. మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు. కడుపు కాలిపోతోంది’ అని అవతలి వైపు నుంచి ఓ ఆడగొంతు మాటలు వినిపించాయి. ఉన్నతాధికారులు సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో విసుక్కోవడమో, కింది స్థాయి అధికారులకు వారి బాధ్యతలను అప్పజెప్పడమో, లేకపోతే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తారు. కానీ ఆమె అలా చేయలేదు. మానవతా హృదయంతో అప్పటికప్పుడు స్వయంగా లెమన్ రైస్‌ తయారుచేసి 11 మంది ఆకలి బాధితుల కడుపు నింపింది. అలా అర్ధరాత్రి సమయంలో..అది కూడా ఆఫ్‌ డ్యూటీలో కూడా కరోనాపై పోరులో భాగస్వామురాలయింది విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి.

Know More

women icon @teamvasundhara

పోలీసుగా లాఠీ పట్టి.. డాక్టరుగా స్టెత్‌ చేపట్టి..!

కరోనాపై పోరులో భాగంగా కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో కోట్లాదిమంది ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ పోలీసులు, వైద్యులు మాత్రం ముందుండి ఈ మహమ్మారిపై పోరాటం సాగిస్తున్నారు. ప్రధానంగా పోలీసులు నిత్యం రోడ్లపైనే ఉంటూ శాంతి భద్రతలను పర్యవేక్షి్స్తున్నారు. ఈ మహమ్మారి మరింత ముదిరిపోకుండా ఎక్కడి ప్రజలు అక్కడే ఉండేలా కట్టడి చేస్తున్నారు. బయటకు వస్తే వైరస్‌ ముప్పు పొంచి ఉన్నా అహర్నిశలు రోడ్లమీదే గస్తీ కాస్తున్నారు. వైద్యుల్లాగే వీరు కూడా కంటిమీద కునుకులేకుండా, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ర్టలోని నాసిక్‌ జిల్లాకు చెందిన ఆర్తీ సింగ్‌... ఓవైపు ఎస్పీగా లా అండ్‌ ఆర్డర్‌ను చక్కబెడుతూనే మరోవైపు వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ఆపత్కాలంలో డబుల్‌ డ్యూటీ చేస్తూ అందరి మన్ననలూ అందుకుంటున్నారు. మరి ఒక పోలీసాఫీసర్‌ వైద్యురాలిగా పనిచేయడమేంటి అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala