అమ్మ కోసం.. అమ్మతో.. ఓ వర్కవుట్!
దేశంలో కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతోన్న నేపథ్యంలో ప్రజలు మరికొన్ని రోజులు సామాజిక దూరం పాటిస్తూ ఇంటికే పరిమితం కావడం మంచిది. ఈ నేపథ్యంలో రోజుల కొద్దీ ఇంట్లో కాలక్షేపం చేస్తూ సమయం గడిపేందుకు ఇబ్బంది పడుతున్న వారు కొందరైతే.. మనసుకు నచ్చిన పనులు చేస్తూ అరుదుగా దొరికే ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటోన్న వారు మరికొందరు. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలలో ఎక్కువశాతం మంది ఈ లాక్డౌన్ సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వీళ్లు వివిధ రకాల పనులు చేస్తున్నప్పటికీ.. ఫిట్నెస్ను మాత్రం నిర్లక్ష్యం చేయట్లేదు. ఈ క్రమంలో ప్రముఖులు అక్కినేని అమల, మిలింద్ సోమన్లు ఇటీవల పోస్ట్ చేసిన వర్కవుట్ వీడియోలను చూసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.. మరి, ఎందుకో మీరే చూడండి..!
Know More