ఎంతమంది 'నిర్భయలు' కన్నుమూయాలి?
మానవత్వానికి మచ్చ తెచ్చిన ‘నిర్భయ’ దోషులను ఉరితీశారు. ఆడపిల్లల భద్రతపై సందేహాలు రేకెత్తించిన ‘దిశా’ హత్యాచార దోషులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అయినా సమాజంలోని కొన్ని మానవ మృగాలు మారడం లేదు. మనిషి ముసుగు ధరించి విచ్చలవిడిగా తిరుగుతూ ఆడపిల్లలపై దారుణ హత్యాచారాలకు పాల్పడుతున్నాయి. సాటి మనిషి అన్న స్పృహ, కనికరం లేకుండా కర్కశంగా ప్రవరిస్తూ అమాయకపు అబలలను బలిగొంటున్నాయి. ఈ నేపథ్యంలో ‘నిర్భయ చట్టాలు’, ’పోలీసుల తూటాలు’ తమనేవీ భయపెట్టలేవంటున్న కొందరు ఉన్మాదుల చేతుల్లో మరో ‘నిర్భయ’ బలైపోయింది.
Know More