సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఈ బ్యూటిఫుల్‌ జర్నీలో మీరే వారికి తోడుగా నిలవాలి!

అమ్మతనం.. ఆడజన్మకు ఆ భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం. అందుకే పెళ్లైన ప్రతి మహిళా తాను అమ్మగా ఎప్పుడెప్పుడు ప్రమోషన్‌ పొందుతానా అని ఆతృతగా ఎదురుచూస్తుంటుంది. ఇక అలాంటి అమ్మతనాన్ని పరిపూర్ణం చేసే ప్రక్రియ బ్రెస్ట్‌ఫీడింగ్‌ . తల్లి తన బిడ్డకు ఎంత ఎక్కువ కాలం పాటు పాలిస్తే అంత మంచిది. దీనివల్ల తల్లీబిడ్డలిద్దరికీ బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే కొత్తగా తల్లైన మహిళలు అటు తన పాపాయి సంరక్షణ చూసుకుంటూ, ఇటు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారు.. మరోవైపు ఇంటి పనుల్నీ సమన్వయం చేసుకుంటారు. ఈ క్రమంలో వారిపై చాలా ఒత్తిడి పడుతుంది. కానీ బిడ్డకు పాలిచ్చేటప్పుడు తల్లి ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ‘ప్రపంచ తల్లిపాల వారోత్సవం’ సందర్భంగా ఇదే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తోంది బాలీవుడ్‌ అందాల తార సమీరా రెడ్డి. కొత్తగా అమ్మతనంలోకి అడుగుపెట్టిన మహిళలకు అటు భర్త, ఇటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, అండదండలు చాలా ముఖ్యమని, తద్వారా అమ్మలు ఎలాంటి ఆందోళన చెందకుండా పిల్లలకు పాలివ్వడం, అన్ని పనుల్ని సమన్వయం చేసుకోవడం వీలవుతుందని చెబుతూ తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టిందీ బ్యూటిఫుల్‌ మామ్‌.

Know More

women icon @teamvasundhara

ఎవరేమనుకుంటే మనకేంటి..? మనకు నచ్చినట్లుగా మనముందాం!

అమ్మతనం.. ఇది ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం.. మహిళలుగా మనకు మాత్రమే దక్కిన గొప్ప వరం. అలాంటి అమ్మతనంలోని మాధుర్యాన్ని ఆస్వాదించే క్రమంలో కొంతమంది మహిళలు ఒత్తిడి, ఆందోళనలకు గురవుతున్నారు.. నలుగురితో పోల్చుకుంటున్నారు.. తమను తామే తక్కువ చేసి చూసుకుంటున్నారు.. కారణం.. అమ్మయ్యాక శరీరంలో కలిగిన మార్పులే! అయితే అలాంటి ఆందోళనలు, పోలికలు అనవసరమంటోంది బాలీవుడ్‌ అందాల అమ్మ సమీరా రెడ్డి. తనకూ ఇలాంటి సంఘటనలు బోలెడన్ని ఎదురయ్యాయని, ఎవరేమన్నా పట్టించుకోకుండా ఎవరి శరీరాన్ని వారు ప్రేమించుకోవాలని అమ్మలందరిలో పాజిటివిటీని నింపుతోంది. ఇటీవలే తల్లైన ఓ మహిళ తనకు పంపిన సందేశానికి బదులిస్తూ ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో పోస్ట్‌ చేసింది సమీర. ఇలా బాడీషేమింగ్‌ అంశాన్ని మరోసారి తెరమీదకు తెచ్చి అతివల్లో స్ఫూర్తి నింపుతోందీ బ్యూటిఫుల్‌ మామ్.

Know More

women icon @teamvasundhara

నా వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే!

కాస్త బొద్దుగా ఉన్న వాళ్లు మన కళ్లల్లో పడ్డారంటే చాలు.. ‘అబ్బ ఎంత లావుగా ఉన్నారు.. బరువు తగ్గి నాలా అవ్వచ్చుగా..’ అని గొణుక్కునేవారు మనలో చాలామందే ఉంటారు. ఇంకొందరేమో ఇదే విషయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా వారిని నేరుగా అడిగేస్తుంటారు కూడా! బాడీ షేమింగ్‌ విషయంలో ఇలాంటి అనుభవాలు తనకూ బోలెడున్నాయని చెబుతోంది తమిళ బొద్దుగుమ్మ విద్యుల్లేఖా రామన్‌. ‘రన్‌ రాజా రన్‌’, ‘సరైనోడు’, ‘ధృవ’, ‘భాగమతి’.. వంటి చిత్రాల్లో నటించి తెలుగు వారి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ లాక్‌డౌన్‌ సమయంలో బరువు తగ్గడమే లక్ష్యంగా పెట్టుకున్నానంటోంది. ఈ క్రమంలోనే తాను కసరత్తులు చేస్తున్నప్పుడు దిగిన ఓ ఫొటోను విద్యుల్లేఖ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయగా ఆమె బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోతో పాటు తన ఫ్యాట్‌ టు ఫిట్‌ స్టోరీని సైతం జతచేసిన ఈ బబ్లీ గర్ల్‌ అంకితభావానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

Know More

women icon @teamvasundhara

కరోనా నుంచి అలా బయటపడ్డా.. అదే నా ఆయుధం!

ఈ రోజుల్లో ఒంట్లో కాస్త నలతగా అనిపిస్తే చాలు.. మన మనసంతా కరోనా వైరస్‌ చుట్టూనే తిరుగుతోంది. మనకూ వైరస్‌ సోకిందేమోనని కంగారు పడిపోతున్నాం. ఇక ఎలాంటి లక్షణాలు లేని వారిలో కూడా కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఎవరి నుంచి ముప్పు ముంచుకొస్తుందో, మనలోనూ కరోనా వైరస్‌ ఉందేమోనని క్షణక్షణం భయంభయంగా గడుపుతున్నాం. ఇదిగో ఇలాంటి భయమే మనల్ని నిలువెల్లా ముంచుతుందంటున్నారు నగరానికి చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పా రెడ్డి. కొద్దిరోజుల క్రితమే కొవిడ్‌ బారిన పడి కోలుకున్న ఆమె.. చక్కటి ఆహారం, వ్యాయామం, ధ్యానంతో ఈ వైరస్‌ను జయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మనలోని రోగనిరోధక శక్తే కరోనాను ఎదిరించే ఆయుధమని, దాన్ని దృఢంగా ఉంచుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించడంతో పాటు ధైర్యంగా అడుగు ముందుకేయాలంటూ సూచిస్తున్నారు. ఈ క్రమంలో తన కొవిడ్‌ అనుభవాలను, దాన్నుంచి బయటపడిన విధానాన్ని ఇన్‌స్టా వీడియోతో పాటు దానికి జతచేసిన సుదీర్ఘమైన క్యాప్షన్‌ రూపంలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో, పోస్ట్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Know More

women icon @teamvasundhara

నిత్యం బిజీబిజీగా గడిపే మనకు ఇదొక చెక్‌ పాయింట్‌!

లాక్‌డౌన్‌.. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని బహుశా ఎవరూ కలలో కూడా అనుకుని ఉండరు. కానీ కరోనా కారణంగా మనం అటువంటి రోజుల్ని చూడాల్సి వస్తోంది. ఈ క్రమంలో సెలబ్రిటీలు తమ ఇళ్లలో ఉంటూనే అభిమానులకు తమ విలువైన సందేశాలను అందిస్తూ.. స్వీయ నిర్భంధం సమయంలో వారెలా గడుపుతున్నారో అందరితో పంచుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌ బ్యూటీ మంచు లక్ష్మీ ప్రసన్న కూడా ఇదే పనిలో ఉంది. ఇంట్లో తాను స్వీయ నిర్బంధం పాటిస్తూనే తన అభిమానులకు కరోనా జాగ్రత్తలు చెబుతోంది లక్ష్మి. అంతేనా.. అమ్మలందరికీ పేరెంటింగ్‌ పాఠాలు కూడా చెబుతోందీ బ్యూటిఫుల్‌ మామ్‌. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్లో ఉంటోన్న చిచ్చర పిడుగుల్ని అదుపు చేయడానికి కొన్ని టిప్స్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిందీ అందాల అమ్మ. మరి, ఈ మంచు బ్యూటీ చెప్పిన ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala