ఈ బర్త్‌డే పార్టీలో వీళ్లదే హంగామా!
తైమూర్ అలీఖాన్, ఇనాయా ఖేము... ప్రస్తుతం బాలీవుడ్లో వీరికున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్లో స్టార్ హీరోలను మించి క్రేజ్‌ను సొంతం చేసుకున్నారీ స్టార్ కిడ్స్. తమ క్యూట్ లుక్స్, అల్లరి మాటలతో అలరించే ఈ చిన్నారులు ఎక్కడున్నా మీడియా కళ్లన్నీ వీరి వైపే తిరుగుతాయి. పుట్టుకతోనే సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకున్న ఈ చిన్నారులు ఎక్కడుంటే అక్కడ సందడే. ఈ క్రమంలో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కవల పిల్లలు యష్(కొడుకు), రూహీ (కూతురు) పుట్టిన రోజు వేడుకల్లోనూ ఈ పటౌడీ పిల్లల హంగామానే హైలైట్‌గా నిలిచింది.
Know More