మెనోపాజ్ దశలో అందాన్ని సంరక్షించుకోండిలా!
వేడి ఆవిర్లు, ఇర్రెగ్యులర్ పిరియడ్స్, మూడ్ స్వింగ్స్, బరువు పెరగడం.. ఇలా చెప్పుకుంటూ పోతే మెనోపాజ్ దశలో మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేసే సమస్యలెన్నో! కేవలం ఆరోగ్యపరంగానే కాదు.. అతివల సౌందర్యాన్ని కూడా దెబ్బతీస్తుందీ దశ. చర్మం పొడిబారడం, మొటిమలు-మచ్చలు ఏర్పడడం, నిర్జీవమైపోవడం.. వంటివి మెనోపాజ్ దశకు చేరువవుతోన్న వారిలో మనం గమనించచ్చు. అయితే ఇదంతా హార్మోన్ల అసమతుల్యత వల్లే జరుగుతుందంటున్నారు సౌందర్య నిపుణులు. అలాగని అందం తగ్గిపోతుందని నిరుత్సాహపడకుండా చక్కటి స్కిన్‌కేర్ రొటీన్ పాటిస్తే సౌందర్యాన్ని సంరక్షించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. మరి, ఇంతకీ ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..
Know More