అందుకే అతనిపై మనసు పడ్డాను.. తప్పేమిటి?
‘భావ ప్రకటన స్వేచ్ఛ’ ఉందంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు సెలబ్రిటీల మనోభావాలు దెబ్బతినేలా కామెంట్లు పెడుతుంటారు. అదేపనిగా వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా వారిని ట్యాగ్ చేస్తూ విమర్శల బాణాలు సంధిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో కొందరు తమపై వచ్చే కామెంట్లను చూసీ చూడనట్లు వదిలేస్తుంటే.. మరికొందరు మాత్రం తమపై నెగెటివ్ కామెంట్లు చేసిన వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రియురాలు వినీ రామన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ సందర్భంగా తనను, తన ప్రియుడిని ఉద్దేశించి అసభ్యకర కామెంట్లు చేసిన ఓ నెటిజన్‌కు తనదైన శైలిలో సమాధానమిచ్చిందామె.
Know More