వీటితో చేతుల్ని కోమలంగా మార్చుకోండి!
కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బయటి నుంచి వచ్చిన ప్రతిసారీ లేదా ఇంట్లో ఉన్నా సరే... పదే పదే హ్యాండ్‌వాష్ లేదా సబ్బుతో చేతుల్ని రుద్ది మరీ కడుగుతున్నాం. అయితే ఇలా పదే పదే చేతుల్ని కడగడం వల్ల చేతులు తేమను కోల్పోయి పొడిబారిపోతున్నాయి.. నిర్జీవంగా మారిపోతున్నాయి. ఇక దీనికి తోడు మహిళలకు అదనంగా ఇంటి పని, వంట పని, గిన్నెలు తోమడం, బట్టలుతకడం.. వంటి రోజువారీ పనుల కారణంగా పదే పదే చేతులు నీళ్లలో నాని మరింత పొడిగా తయారవుతున్నాయి. ఫలితంగా దురద రావడం, మంట పుట్టడం, అలర్జీలు.. వంటి సమస్యలొచ్చే అవకాశమే ఎక్కువ. మరి, వీటి నుంచి బయటపడాలంటే ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతోనే స్క్రబ్స్ తయారుచేసుకొని వాడితే ఫలితం ఉంటుందంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, చేతుల్ని తేమగా, కోమలంగా మార్చే ఆ న్యాచురల్ స్క్రబ్స్ ఏంటో తెలుసుకొని, మనమూ ట్రై చేసేద్దామా..!
Know More