అందుకే రోట్లో రుబ్బుకున్న పచ్చళ్లే మంచివట!
పల్లీ చట్నీ, నువ్వుల చట్నీ, కొబ్బరి చట్నీ, కరివేపాకు చట్నీ, వివిధ రకాల కాయగూరలు-ఆకుకూరలతో చేసుకునే చట్నీలు.. ఇలా ఏదో ఒక పచ్చడి లేనిదే మన భోజనం పూర్తి కాదు. బయట హోటల్లో భోంచేసినప్పుడు కూడా ఏదో ఒక చట్నీ వడ్డించడం మనం చూస్తూనే ఉంటాం. మన ఆహారపుటలవాట్లలో చట్నీకి ఉండే ప్రత్యేకత అలాంటిది! మరి, అలాంటి చట్నీని తయారుచేసుకోవడానికి మనం ఏం ఉపయోగిస్తాం..? మిక్సీ లేదంటే వెట్ గ్రైండర్ అనే అంటారంతా! సులభంగా, త్వరగా చట్నీ చేయడం పూర్తవుతుంది కాబట్టే అందరూ వీటి పైనే ఆధారపడుతుంటారు. కానీ అదే సమయంలో రోట్లో రుబ్బుకున్న పచ్చడి అందించే రుచిని ఇది అందించలేదని కూడా అంటుంటారు మన ఇళ్లల్లో ఉండే పెద్దవాళ్లు.
Know More