ఈసారి దసరా సరదాల్ని మిస్సవుతున్నాం!
చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో బోలెడన్ని సరదాల్ని తీసుకొస్తుంది ‘దసరా’ పండగ. దేశవ్యాప్తంగా దుర్గా శరన్నవరాత్రుల పేరుతో వైభవంగా జరుపుకొనే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ అలంకారాల్లో కొలుస్తుంటారు. ఇక నవరాత్రుల్లో చివరి రోజైన ‘విజయదశమి’ నాడు అసలు సిసలైన పండగ హడావిడి ఉంటుంది. మరి, ఇలా ఎన్నో సరదాల్ని, మధురానుభూతుల్ని అందించే ఈ పర్వదినాన్ని కరోనా పడగ కింద ఎంతో జాగ్రత్తగా జరుపుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో తాము కూడా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా పండగను సెలబ్రేట్ చేసుకుంటామంటోంది బాలీవుడ్ అందాల తార రాణీ ముఖర్జీ. ఈ సందర్భంగా పండగకు సంబంధించి తన ప్రణాళికలను షేర్ చేసుకుందీ ముద్దుగుమ్మ.
Know More