దూరమయ్యాకే అది ప్రేమని తెలిసింది!
సాధారణంగా లైఫ్ పార్ట్నర్ బెస్ట్ ఫ్రెండ్‌లా ఉండాలంటారు. మరి అలాంటిది చిన్నప్పటి నుంచి కలిసి తిరిగి, మన ఇష్టాయిష్టాల గురించి తెలిసిన బెస్ట్ ఫ్రెండే ‘బెటరాఫ్’ అయితే అంతకన్నా అదృష్టం ఉండదేమో! ఈ విషయంలో బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వరుణ్ ధావన్, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ ఎంతో లక్కీ అని చెప్పచ్చు. చిన్ననాటి స్నేహితులైన వీరిద్దరి మధ్య స్నేహం వారితో పాటే పెరిగింది.. ప్రేమగా మారింది. అయితే తమ ఇద్దరి మధ్య స్నేహాన్ని మించిన మరో బలమైన బంధం ఏదో ఉందని ఒకరికొకరు దూరమయ్యాక కానీ తెలుసుకోలేకపోయామంటున్నారీ అందాల జంట. ఏదైతేనేం.. వారి ప్రేమను పెద్దలు కూడా ఆశీర్వదించడంతో జనవరి 24న ఏడడుగులు నడిచేందుకు సిద్ధమవుతోందీ జంట. ఈ నేపథ్యంలో ఈ ముద్దుల జంట ప్రేమకథ, పెళ్లి ముచ్చట్లేంటో తెలుసుకుందాం రండి..
Know More