అలియా పొదుపు పాఠాలు విన్నారా?
అలియా భట్... టీనేజ్లోనే సినిమాల్లో అడుగుపెట్టి అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ. మహేశ్ భట్ వారసురాలిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినా.. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’, ‘హైవే’, ‘రాజీ’, ‘ఉడ్తా పంజాబ్’, ‘గల్లీబాయ్’.. లాంటి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. ఇటీవల ‘గంగూబాయి’ మూవీ పోస్టర్లో పవర్ఫుల్ లుక్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ అందాల తార...‘ఆర్ ఆర్ ఆర్’ (వర్కింగ్ టైటిల్) సినిమాతో త్వరలోనే తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుంది. సినిమాలు, తన ఫ్యాషన్ సెన్స్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ క్రేజీ హీరోయిన్ తన సింపుల్ లైఫ్‌స్టైల్‌తోనూ చాలామందికి స్ఫూర్తినిస్తోంది. తనకు అనవసర ఖర్చులు చేయడం అస్సలు ఇష్టముండదని చెప్పే అల్లూ బేబీ.. తనకు లండన్‌లో ఇల్లు కొనడం ఎప్పటినుంచో కల అని, అది రెండేళ్ల క్రితం నెరవేరిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించింది. దీంతో పాటు తన ఆర్థిక ప్రణాళికల గురించి పలు ఆసక్తికర విషయాలను సైతం పంచుకుందీ బ్యూటిఫుల్ బేబ్.
Know More