రెండు క్లోజప్లు తీసి మొహంలో కళ లేదన్నారు!
‘ఆకాశం ఏనాటిదో...అనురాగం ఆనాటిది’ అంటూ ‘నిరీక్షణ’ సినిమాలో భానుచందర్తో కలిసి ఆడిపాడారు అర్చన. ఆ సినిమాలో మాటల్లో చలాకీ తనం, చూపుల్లో అమాయకత్వం కలగలిపిన గిరిజన యువతి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారామె. ఆ తర్వాత ‘లేడీస్ టైలర్’, ‘మట్టి మనుషులు’, ‘దాసి’, ‘భారత్ బంద్’.. లాంటి విభిన్న కథా చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రంగు తక్కువ అంటూ తొలినాళ్లలో నటిగా తిరస్కరణకు గురైన ఆమె... వరుసగా రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. చాలా కాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న ఈ అందాల తార సుమారు పాతికేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి కెమెరా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొని తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను సరదాగా షేర్ చేసుకున్నారు అర్చన.
Know More