కాబోయే అమ్మలూ.. చలికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి!
రిధిమకు ఇప్పుడు ఐదో నెల. తనకు ముందు నుంచీ ఇమ్యూనిటీ అంతంత మాత్రమే! దాంతో పదే పదే జలుబు, దగ్గు బారిన పడుతుంటుందామె. ఇక ఈ సమస్యలు ఇప్పుడామెకు సవాళ్లుగా మారాయి. ఇటీవలే నెల తప్పిన మృదులకు చలికాలమంటే అస్సలు పడదు. ఎందుకంటే ఈ సమయంలో తన చర్మం విపరీతంగా పొడిబారిపోతుంటుంది. దీంతో పొట్ట పెరిగే క్రమంలో చర్మం సాగి ఇంకెంత దురద పుడుతుందోనని తన భయం! ఏదేమైనా చలికాలంలో ఇలాంటి సమస్యలు చాలామందికి కామనే. అసలే చలికాలంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరు మందగిస్తుందంటే.. గర్భిణుల్లో ఆ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. తద్వారా వారు ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఎక్కువ! ఇక వీటికి తోడు ప్రస్తుతం కరోనా ముప్పు కూడా పొంచి ఉంది. కాబట్టి ఈ సీజన్లో కాబోయే తల్లులు తమ ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని సలహా ఇస్తున్నారు.
Know More