సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నా పొగరు, ధైర్యం.. అన్నీ అమ్మ నుంచే వచ్చుంటాయి!

అందం, అణకువ, వాక్చాతుర్యం.. ఇలా ఒక వ్యాఖ్యాతకు ఉండాల్సిన లక్షణాలన్నీ పుణికిపుచ్చుకుంది అందాల యాంకర్‌ అనసూయ. ‘జబర్దస్త్‌’తో బుల్లితెరపై సందడి చేస్తూ ప్రతి ఇంట్లో ఆడపడుచులా మారిపోయిందీ ముద్దుగుమ్మ. తన చలాకీ మాటలతో, చిరునవ్వుతో అందరినీ పలకరించే అను.. ‘రంగమ్మత్త’గా సినీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది. అయితే తానీ స్థాయికి చేరుకోవడానికి చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడ్డానని, అమ్మ వల్లే ఇప్పుడిలా ఉన్నానంటోంది. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో సరదాగా మాట్లాడుతూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి మనకు తెలియని బోలెడన్ని విషయాలు పంచుకుందీ బుల్లితెర బ్యూటీ.

Know More

women icon @teamvasundhara

మతం కన్నా మానవత్వమే గొప్పదంటూ ఆ బిడ్డలకు అమ్మయింది!

కరోనా... ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పేరు వింటేనే ఆమడ దూరం పరిగెడుతున్నాం. మహమ్మారి భయం నేపథ్యంలో పక్కింటివాళ్లతో కూడా ప్రశాంతంగా మాట్లాడలేని పరిస్థితి. ఇక కరోనా బాధితులను కానీ, వారి కుటుంబ సభ్యులను కానీ కన్నెత్తైనా చూడం. .. పన్నెత్తైనా పలకరించం. ఇలా మనుషులనే కాదు వారిలో దాగున్న మానవత్వాన్ని కూడా నామరూపాలు లేకుండా చేస్తోందీ కరోనా మహమ్మారి. కానీ ‘దైవం మానుష రూపేణా’ అన్న మాటలను నిజం చేస్తూ అక్కడక్కడ కొందరు తమ మంచి పనులతో రియల్‌ హీరోలు అనిపించుకుంటున్నారు. ఈక్రమంలో కోల్‌కతాకు చెందిన ఓ మహిళా టీచర్‌ కూడా ఇదే విధంగా అందరి మన్ననలు అందుకుంటోంది. అయితే ఆపత్కాలంలో పిల్లలకు పాఠాలు బోధిస్తున్నందుకు కాదు. మరి దేనికో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

Know More

women icon @teamvasundhara

కన్న బిడ్డను ఎలాగైనా కలుసుకోవాలని..!

‘అమ్మ ప్రేమకు ఆకాశమే హద్దంటారు. సహనానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే తల్లి... తన పిల్లల మోములో చిరునవ్వు కోసం ఎలాంటి కష్టాలకైనా ఎదురీదుతుంది. ఈ మాటలను అక్షరాలా నిజం చేసింది ముంబైకు చెందిన 26 ఏళ్ల సోనియా దాస్‌. లాక్‌డౌన్ కారణంగా సుదూర ప్రాంతంలో అనారోగ్యంతో ఉన్న తన ఐదేళ్ల కుమారుడిని కలుసుకునేందుకు పెద్ద సాహసమే చేసిందా మాతృమూర్తి. ఈ ఆపత్కాలంలో మొత్తం ఐదురోజుల పాటు సుమారు 1800 కిలోమీటర్లు స్కూటర్‌పై ప్రయాణం చేసిన ఆమె ఎట్టకేలకు తన గమ్యాన్ని చేరుకుంది. పిల్లల విషయంలో తల్లి ప్రేమ ఎంతవరకైనా తీసుకెళుతుందని నిరూపించిన ఈ సూపర్‌ మామ్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

నా కూతురి నుంచి దూరంగా ఉండేందుకు అదే మంచి మార్గమనిపించింది!

కొన్ని నెలల క్రితం కరోనా విజృంభణ తీవ్రంగా ఉండడంతో వైద్య సేవలు అందించలేక విదేశీయులను తమ సొంత దేశాలకు వెళ్లిపొమ్మంటూ ఇటలీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అదే సమయంలో అంతర్జాతీయ విమాన సేవలు సైతం నిలిపి వేశారు. దీంతో ఇటలీలో ఉంటోన్న భారతీయులు దిక్కుతోచని స్థితిలో సతమతమయ్యారు. మరికొన్ని రోజులు అక్కడే ఉంటే తాము కూడా కరోనాకు బలవుతామనే భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలాన్ని గడిపారు. ఈ క్రమంలో ఇటలీలో చిక్కుకుపోయిన 263 మంది భారతీయులను మన దేశానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఓ భారీ బోయింగ్‌ 777 విమానాన్ని సిద్ధం చేసింది ఎయిర్‌ ఇండియా సంస్థ. ఈ విమానానికి సారథ్యం వహించింది ఓ మహిళ. తనే కెప్టెన్ స్వాతి రావల్‌. కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న ఇటలీ లాంటి దేశం నుంచి మన వాళ్లను క్షేమంగా స్వదేశానికి చేర్చి.. రెస్క్యూ ఫ్లైట్‌కు సారథ్యం వహించిన తొలి మహిళా సివిలియన్‌ పైలట్‌గా చరిత్ర సృష్టించిందీ వీరనారి. అప్పటి తన ప్రయాణానికి సంబంధించిన కొన్ని సంఘటనలను ఇటీవల మళ్లీ గుర్తుకు తెచ్చుకుంది స్వాతి. ఈక్రమంలో తన అనుభవాలను షేర్‌ చేసుకుంది. మరి వాటిని ఆమె మాటల్లోనే విందాం రండి..

Know More

women icon @teamvasundhara

అమ్మ ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది!

ప్రపంచంలో ఎవరి ప్రేమకైనా ప్రత్యామ్నాయం దొరుకుతుంది. కానీ అమ్మ ప్రేమకు మాత్రం ఎలాంటి ప్రత్యా్మ్నాయముండదు. కరోనా కారణంగా ప్రస్తుతం వైద్యులైన చాలామంది తల్లులు కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. కనీసం పిల్లలను కూడా చూడకుండా నెలల పాటు ఆస్పత్రిలోనే ఉంటూ కరోనా బాధితులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈక్రమంలో ఇంగ్లండ్‌కు చెందిన డాక్టర్‌ సూసీ కూడా విధి నిర్వహణలో భాగంగా పదేళ్లు వయసు కూడా దాటని తన ఇద్దరు పిల్లలకు తొమ్మిది వారాల పాటు దూరమైంది. అయితే తాజాగా కొంచెం సమయం దొరకడంతో తన పిల్లలను చూడాలనుకున్న ఆమె వారికో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

Know More

women icon @teamvasundhara

అమ్మను ఆప్యాయంగా హత్తుకునేందుకు ఈ మహిళ ఏం చేసిందంటే!

కరోనా... అటు శారీరకంగా, ఇటు మానసికంగా ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతోన్న వైరస్‌. మనుషుల మధ్య సామాజిక దూరాన్ని తీసుకొచ్చిన ఈ మహమ్మారి కారణంగా కనీసం కుటుంబ సభ్యులతో కూడా దగ్గరగా ఉండలేని దీన పరిస్థితి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తుందో తెలియని ఈ వైరస్‌ భయంతో సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు దూరంగా ఉంటున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో దూరంగా ఉన్న తన తల్లిని కలుసుకునేందుకు ఓ వినూత్న ప్రయత్నం చేసింది అమెరికాకు చెందిన ఓ మహిళ. ఇందులో భాగంగా హిప్పోపొటామస్‌ (నీటి గుర్రం) కాస్ట్యూమ్‌ ధరించిన ఆమె సామాజిక దూరం నిబంధనలు పాటిస్తూ తన తల్లిని ఆప్యాయంగా హత్తుకుంది.

Know More

women icon @teamvasundhara

కన్న బిడ్డలు కళ్లెదుటే ఉండాలని తల్లడిల్లారు!

అమ్మను మించిన దైవం లేదంటారు. ఎందుకంటే ఆకాశమే హద్దుగా ఆమె చూపించే ప్రేమకు అంతనేది ఉండదు. సహనానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే తల్లి.. పిల్లల మోములో చిరునవ్వు కోసం ఎన్ని కష్టాలకైనా ఎదురీదుతుంది. ఈ మాటలను మరోసారి నిజం చేసింది మహారాష్ర్టలోని పుణే జిల్లా చించావడ్‌కు చెందిన సోనూ ఖందారే. లాక్‌డౌన్‌ కారణంగా సుదూర ప్రాంతంలో చిక్కుకుపోయిన తన కుమారుడిని వెనక్కి తీసుకొచ్చేందుకు పెద్ద సాహసమే చేసిందామె. ఈ ఆపత్కాలంలో కొడుకు తన కళ్లెదుటే ఉండాలని స్కూటీపై ఒంటరిగా రానూ పోనూ.. మొత్తంగా 1200కిలోమీటర్లు ప్రయాణం చేసిందామె. మరి ‘మాతృ దినోత్సవం’ వేళ అమ్మ ప్రేమకు అంతులేదని రుజువుచేసిన ఈ సూపర్‌ మామ్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

ఎంత కష్టం.. ఎంత కష్టం.. పిల్లల ఆకలి తీర్చేందుకు రాళ్లనే ఉడికించింది!

అన్న మనపై అనురాగం చూపించొచ్చు.. అక్క మనకి ఆప్యాయత పంచచ్చు. నాన్న మన బాధ్యత తీసుకోవచ్చు. కానీ అమ్మ మాత్రం అన్నీ తానే అయి పిల్లల్ని కడుపులో దాచుకుంటుంది. అందుకే ఈ సృష్టిలో దేనికైనా ప్రత్యామ్నాయం దొరుకుతుందేమో కానీ.. అమ్మ ప్రేమకు మరేదీ సాటిరాదని చెప్పడం అతిశయోక్తి కాదు.. కష్టమొచ్చినా, కన్నీళ్లొచ్చినా పిల్లల మేలు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది అమ్మ. వాళ్ల బాగోగుల కోసం తన శక్తినంతా ధారపోస్తుంది. అందుకే పిల్లలు కూడా అమ్మనే ‘సూపర్‌ హీరో’గా భావిస్తారు. తను తోడుంటే ఎలాంటి సమస్య వచ్చినా ఇట్టే పరిష్కారం దొరుకుతుందని ఆ పిల్లల నమ్మకం. అలాంటి నమ్మకాన్ని ఈ పిల్లలు కూడా తన తల్లిలో చూశారు. అయితే తన పిల్లల ఆకలిని చూడలేక ఎప్పటికీ ఉడకని వంట చేసిందా తల్లి. అయితే అది తినేందుకు మాత్రం కాదని ఆ పసి హృదయాలకు తెలియదు. గంజి మెతుకులకు నోచుకోని తన పిల్లల ఆకలిని మరిపించడానికి ఆ తల్లికి ఇంతకంటే వేరే దారి కనిపించలేదు. వినగానే గుండె బరువెక్కించే ఈ హృదయవిదారక ఘటన కెన్యాలో చోటుచేసుకుంది.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala