అమ్మాయిలూ... వాటిని మీరే సంపాదించుకోవాలి ..!
సోషల్ మీడియా విస్తృతి బాగా పెరిగినప్పటి నుంచి సినీ తారలు తమ లేటెస్ట్ ఫ్యాషన్లకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో నేరుగా పంచుకుంటున్నారు. ఈక్రమంలోనే తాజాగా అందాల భామలు అదాశర్మ, శిల్పా శెట్టి, సోనమ్ కపూర్లు వేర్వేరు సందర్భాల్లో పసుపు వర్ణంలో మెరిసిపోయారు. యెల్లో కలర్లో రూపొందించిన విభిన్న డిజైనర్ దుస్తుల్ని ధరించి తళుక్కుమన్నారు. అదా పసుపు రంగు అనార్కలిలో మెరవగా, శిల్ప పసుపు రంగు ప్యాంట్ సూట్లో లేడీ బాస్లా కనిపించింది. ఇక బాలీవుడ్ ఫ్యాషనిస్టా సోనమ్.. యెల్లో కలర్ టైర్డ్ స్కర్ట్ ధరించి ట్రెండీగా ముస్తాబైంది. ఇలా తమ ఫొటోలను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ.. వాటికి ఆసక్తికర క్యాప్షన్లను కూడా జతచేశారీ లవ్లీ బేబ్స్. మరి ఆ ఫొటోలు, క్యాప్షన్లపై మీరూ ఓ లుక్కేయండి...
Know More