ఆయిల్ పుల్లింగ్ చేయకపోతే నా రోజు మొదలు కాదు!
ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకున్న తర్వాత మౌత్వాష్తో నోరు పుక్కిలించడం మనలో చాలామంది చేసేదే. దంతాలు-చిగుళ్ల ఆరోగ్యానికి, నోటి దుర్వాసనను దూరం చేయడానికి ఈ ప్రక్రియ బాగా తోడ్పడుతుంది. అయితే సాధారణంగా బయట దొరికే మౌత్వాష్లలో ఉండే రసాయనాల గాఢత నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే మన వంటింట్లో ఉండే కొన్ని రకాల నూనెలతో నోటిని పుక్కిలించడం వల్ల నోరు శుభ్రపడడమే కాదు.. ఇతర ఆరోగ్య ప్రయోజనాలూ చేకూరతాయని వారు సూచిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార అనుష్కా శర్మ కూడా ఇదే విషయం చెబుతోంది. రోజూ ఉదయాన్నే పరగడుపున ఆయిల్ పుల్లింగ్ చేయనిదే తన రోజు ప్రారంభం కాదని, ఈ ప్రక్రియతో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు సైతం చేకూరతాయని తాజాగా ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టిందీ ముద్దుగుమ్మ. మరి, ఆయిల్ పుల్లింగ్ గురించి అనుష్క ఏమంటోందో, ఈ ప్రక్రియ వల్ల చేకూరే ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..?
Know More