ఉన్నది ఒకటే జిందగీ... ఎంజాయ్ చేయండి.!
అందమైన రూపం.. ఆకట్టుకునే అభినయం.. అనుపమా పరమేశ్వరన్ సొంతం. చేసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుందీ ముద్దుగుమ్మ. ‘ప్రేమమ్’ అనే మలయాళ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ చిన్నది.. ఈ సినిమాతో ఇతర భాషల్లోనూ అభిమానులను సంపాదించుకుంది. ‘అ..ఆ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అను.. తెలుగు ‘ప్రేమమ్’తో మరింత చేరువైంది. అనంతరం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందీ కేరళ కుట్టి.
Know More