పాజిటివ్ వచ్చినా ‘పాజిటివ్’గానే ఉన్నాం!
పేద-ధనిక, ఆడ-మగ, చిన్నా-పెద్దా.. ఈ తేడాలేవీ కరోనా మహమ్మారికి తెలియవు.. కనికరం లేకుండా విరుచుకుపడడం తప్ప! అందుకే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.. సామాన్యులే కాదు.. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఆ విషయాన్ని నిరభ్యంతరంగా సోషల్ మీడియాలో పంచుకుంటూ తమ ఫ్యాన్స్‌కు కరోనా జాగ్రత్తలు చెబుతున్నారు. అంతేకాదు.. తమ సందేశాల ద్వారా అభిమానుల్లో భయం పోగొట్టి ధైర్యాన్ని నింపుతున్నారు. తాజాగా బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కూతురు ఆరాధ్యకు కూడా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం వీరిద్దరూ ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో చికిత్స తీసుకుంటున్నారు. గతంలోనూ పలువురు ముద్దుగుమ్మలు ఈ వైరస్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసింది. అయితే తాము ఈ మహమ్మారి బారిన పడినప్పటికీ ఎంతో ధైర్యంగా ఉన్నామని, ఆత్మస్థైర్యమే కరోనాకు ఔషధమని సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెడుతూ తమ ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. మరికొందరు తాము కొవిడ్‌ను జయించిన అనుభవాలను అందరితో పంచుకుంటూ తమ ఫ్యాన్స్‌లో ధైర్యం నూరిపోశారు. ఈ నేపథ్యంలో కొవిడ్ బారిన పడిన కొందరు ముద్దుగుమ్మల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Know More