ఈ అందమైన ప్రేమకథను చూసి కాలానికి కన్ను కుట్టిందేమో!
సినిమా రంగంలో ఉన్న వారిద్దరూ అనుకోకుండా పరిచయమయ్యారు. మంచి స్నేహితులుగా మారారు. అభిప్రాయాలు, అభిరుచులు కలవడంతో పదేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలారు. అనంతరం పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి పీటలెక్కారు. తమ ప్రేమ బంధాన్ని మరింత పరిపూర్ణం చేసుకునేందుకు ఒక పండంటి బిడ్డను కూడా తమ లైఫ్‌లోకి ఆహ్వానించేందుకు రడీ అయ్యారు. అయితే వారి అన్యోన్య దాంపత్యాన్ని చూసి కాలానికి కన్ను కుట్టిందేమో! నిండు నూరేళ్లు కలిసి జీవించాలన్న వారి కలలను కల్లలు చేసి ఇద్దరినీ విడదీసింది. ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ నటుడు చిరంజీవి సర్జా, ఆయన సతీమణి మేఘనా రాజ్‌ల అందమైన ప్రేమకథ ఇలా మధ్యలోనే విషాదాంతమైంది. అప్పటివరకు తనతో కలిసున్న సర్జా హఠాన్మరణం మేఘనకు తీరని శోకాన్ని మిగిల్చింది. అందుకే అంత్యక్రియల సమయంలో ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.
Know More