వేసవిలో చల్లదనం కోసం సబ్జాగింజలు వేసిన ఫలూదాను హాయిగా తాగేస్తుంటాం. చల్లదనమే కాదు.. సబ్జాగింజల వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి.
వేడిని తగ్గిస్తుంది: నీళ్లలో సబ్జాగింజలు వేసుకుని కాస్త పంచదార లేదా తేనె కలిపి తాగితే ఎండ వేడి నుంచి రక్షించుకోవచ్చు. నిమ్మకాయ నీళ్లు, షర్బత్‌లు, మిల్క్షేకుల్లో చల్లదనం కోసం సబ్జా గింజలను కలిపి తాగొచ్చు.
బరువు నియంత్రణ: వీటిలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల తిన్న తర్వాత కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఆకలి వేయదు. బరువు తగ్గుతారు.
* ఫ్రూట్ సలాడ్‌లో కాసిన్ని సబ్జాగింజలు వేసుకుని తీసుకుంటే మధ్యాహ్నం ఎక్కువ అన్నం తినలేరు. అలా అధిక బరువు నియంత్రణకు ఇవి తోడ్పడతాయి.
* శరీరంలోని వ్యర్థాలను సహజసిద్ధంగా బయటకు పంపడానికి సబ్జా తోడ్పడుతుంది. రాత్రి పాలల్లో కొన్ని సబ్జాగింజలు వేసుకుని తాగితే మలబద్ధకం ఉండదు.
* రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయివి. పిండిపదార్థాలు గ్లూకోజ్‌గా మారకుండా సాయపడతాయి.
* వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Also Read: రోగనిరోధక శక్తిని పెంచే జామ..!