సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
corona virus

రోగనిరోధక శక్తిని పెంచే జామ..!

Health Benefits of Guava or Jaama in telugu

కొందరు దోరజామకాయలంటే మనసు పారేసుకుంటారు... ఇంకొందరు మగ్గినవంటే ఇష్టపడతారు... ఎలా తిన్నా జామ పోషకాల ఖజానానే! ముఖ్యంగా రోగనిరోధక శక్తి మెండుగా ఉండే ఆహారం...

జామలో విటమిన్‌-సి అధికమొత్తంలో ఉంటుంది. కాయలో కాకుండా పండులో ఈ విటమిన్‌ ఎక్కువగా ఉండటం దీని ప్రత్యేకత. ఇది రోగనిరోధకశక్తిని పెంచి ఇన్ఫెక్షన్స్‌ రాకుండా కాపాడుతుంది.
* 100 గ్రాములు లేదా కప్పు పండ్ల ముక్కల నుంచి రోజులో మనకు కావాల్సిన దానికంటే ఎక్కువగానే విటమిన్‌-సి అందుతుంది.
* ఈ పండులో విటమిన్‌- ఎ కూడా దొరుకుతుంది. ఈ పండును తరచు తీసుకోవడం వల్ల కంటి శుక్లాలు పెరగవు. రెటీనా పాడవకుండా కాపాడుతుంది. వయసు పైబడటం వల్ల వచ్చే కంటి సమస్యలనూ అడ్డుకుంటుంది.
* ఈ పండులోని పీచు జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.
*● జలుబు, దగ్గు ఉన్నప్పుడు పచ్చి జామకాయను తినడం వల్ల మేలు జరుగుతుంది. దానిలోని వగరు... మ్యూకస్‌ (తెమడ)ను పలుచగా చేస్తుంది. దాంతో జలుబు, దగ్గు తగ్గుముఖం పడతాయి.
* మలబద్ధకంతో బాధపడేవారు జామకాయను జ్యూస్‌లా తీసుకుంటే వెంటనే ఫలితం కనిపిస్తుంది.
- డాక్టర్‌ జానకీ శ్రీనాథ్‌, పోషకాహార నిపుణులు

women icon@teamvasundhara
health-benefits-and-preparation-of-masala-oats-in-telugu
women icon@teamvasundhara
foods-take-in-summer-to-avoid-sunstroke
women icon@teamvasundhara
preparation-of-betel-leaves-sharbat-or-tamalapaku
women icon@teamvasundhara
health-benefits-of-bottle-gourd-or-sorakaya
women icon@teamvasundhara
health-benefits-of-anjeer-fruit
women icon@teamvasundhara
health-benefits-of-almonds
women icon@teamvasundhara
health-benefits-of-moong-dal-in-summer
women icon@teamvasundhara
corona-virus-covid-19-black-pepper-tea-benefits