సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
corona virus

ఆరోగ్యానికి మీ ‘ఓట్స్‌’ !

Health Benefits and Preparation of Masala Oats in Telugu

బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం... పీచు, మాంసకృత్తులు మెండుగా ఉండే ఓట్స్‌ ఆరోగ్యానికి అందించే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

ఓట్స్‌లో పీచు.. బీటా-గ్లూకాన్‌ రూపంలో ఉంటుంది. అందువల్ల వీటిని కొద్దిమొత్తంలో తీసుకున్నా సరే పొట్ట నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది చక్కటి ఎంపిక. అలాగే పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య కూడా ఉండదు. మలబద్ధకంతో బాధపడే వృద్ధులు వీటిని తీసుకుంటే మేలు.
* పాలిష్‌ చేసిన బియ్యం, గోధుమలకు బదులుగా ఓట్స్‌ వాడినప్పుడు కొలెస్ట్రాల్‌, ట్రై గ్లిజరైడ్స్‌ తగ్గుతాయి.
* ఓట్స్‌లో ఐరన్‌, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచే బి-కాంప్లెక్స్‌ విటమిన్లు కూడా ఉంటాయి.
* వీటిలోని బీటా గ్లూకాన్‌.. కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది.
* వీటిలో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫినాల్స్‌ మెండుగా ఉంటాయి. దాంతో మన శరీరంలో ఇమ్యూనిటీ స్థాయి పెరుగుతుంది.
* ఓట్స్‌తో ఉప్మా, ఓట్స్‌ పిండితో చపాతీలు, పూరీలు, మసాలా ఓట్స్‌ వంటి రుచికరమైన పదార్థాలను చేసుకోవచ్చు.
జాగ్రత్తలు:
* అందరికీ ఓట్స్‌ పడకపోవచ్చు. కాబట్టి వీటిని నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోవద్దు. ఓట్స్‌ తీసుకున్నప్పుడు ఎక్కువగా నీరు తాగాలి. వీటిని ఎక్కువసేపు ఉడికించకూడదు.


మసాలా ఓట్స్‌

290520vasu4c.jpg

కావాల్సినవి: ఓట్స్‌-కప్పు, ఉల్లిపాయ, బీన్స్‌, క్యారెట్‌, టమాట ముక్కలు-పావుకప్పు చొప్పున, సన్నగా తరిగిన వెల్లుల్లి-చెంచా, ధనియాలపొడి-పావు చెంచా, జీలకర్రపొడి- పావుచెంచా, కొత్తిమీర-కొద్దిగా, నిమ్మరసం- రెండు చెంచాలు, ఉప్పు-తగినంత, నూనె- కొద్దిగా, పసుపు-చిటికెడు.
తయారీ: పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోయాలి అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి, టమాట, బీన్స్‌, క్యారెట్‌ ముక్కలు వేసి కాసేపు వేయించాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు వేసి కలపాలి. కొద్దిగా వేగిన తరువాత తగినన్ని నీళ్లు పోసి ఈ ముక్కలను ఉడికించాలి. ఇవి ఉడికిన తరువాత ఓట్స్‌ వేసి కొద్దిసేపు మగ్గించాలి. కొత్తిమీర వేసి, నిమ్మరసం చల్లుకుంటే రుచికరమైన మసాలా ఓట్స్‌ రెడీ!
- డాక్టర్‌ జానకీ శ్రీనాథ్‌, పోషకాహార నిపుణులు

women icon@teamvasundhara
causes-and-precautions-for-d-vitamin-deficiency-in-telugu
women icon@teamvasundhara
foods-take-in-summer-to-avoid-sunstroke
women icon@teamvasundhara
preparation-of-betel-leaves-sharbat-or-tamalapaku
women icon@teamvasundhara
health-benefits-of-bottle-gourd-or-sorakaya
women icon@teamvasundhara
health-benefits-of-anjeer-fruit
women icon@teamvasundhara
health-benefits-of-almonds
women icon@teamvasundhara
health-benefits-of-moong-dal-in-summer
women icon@teamvasundhara
corona-virus-covid-19-black-pepper-tea-benefits