సీమ మేడిపండు.. మేలు చూడు!
అంజీరాను ‘సీమ మేడిపండు’ అనీ పిలుస్తారు. ఇది పండు, ఎండు రూపాల్లో లభిస్తుంది. దీన్ని ఎలా తిన్నా ...ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం వంటి ఖనిజాలు, విటమిన్-బి6 అధికంగా శరీరానికి అందుతాయి. వీటితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లూ పుష్కలంగా ఉంటాయి.